Share News

రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడేది టీడీపీయే: బండారు

ABN , Publish Date - Dec 24 , 2023 | 01:38 AM

రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడేది టీడీపీయే: బండారు

రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడేది టీడీపీయే: బండారు

రావులపాలెం, డిసెంబరు 23: ప్రస్తుతం సైకో జగన్‌ పాలనలో అగమ్యగోచరంగా మారిన రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడి అభివృద్ధి పథంలో నడిపించే శక్తి ఒక్క టీడీపీకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలె టీడీపీ కార్యాలయం వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన కొందరు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన కోట శ్రీహరి, సత్యనారాయణ, ముమ్మిడివరపు సునీల్‌, పాల దుర్గానవీన్‌లకు ఆయన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ సైకో జగన్‌ పాలనలో యువత భవిష్యత్‌ నాశనమవుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే యువతతో పాటు అన్నిరంగాలు, అన్నివర్గాలు అభివృద్ధికి కృషిచేస్తుందన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 01:38 AM