రాష్ట్ర స్థాయి బెస్ట్‌ బీఎల్‌వో అవార్డు అందుకున్న అరుణకుమారి

ABN , First Publish Date - 2023-01-26T01:17:51+05:30 IST

నిడదవోలు మండలం విజ్జేశ్వరం సచివాలయంలో ప్రొటెక్షన్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న జి.అరుణ కుమారి సీఎస్‌ జవహర్‌ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ బీఎల్‌వోగా అవార్డు అందుకున్నారు.

రాష్ట్ర స్థాయి బెస్ట్‌ బీఎల్‌వో అవార్డు అందుకున్న అరుణకుమారి
అవార్డు అందజేస్తున్న సీఎస్‌ జవహర్‌రెడ్డి

నిడదవోలు, జనవరి 25 : నిడదవోలు మండలం విజ్జేశ్వరం సచివాలయంలో ప్రొటెక్షన్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న జి.అరుణ కుమారి సీఎస్‌ జవహర్‌ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ బీఎల్‌వోగా అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా ఆమె ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ గవర్నర్‌ హరి భూషణ్‌ అధ్యక్షతన బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి బెస్ట్‌ బీఎల్‌వో అవా ర్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియలో పూర్తి స్థాయిలో కృషి చేసి తూర్పుగోదావరి జిల్లాలో ప్రఽథమ స్థానంలో నిలిచినందుకు అవార్డు అందజేశారన్నారు.ఈ అవార్డు అందుకో వడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.

Updated Date - 2023-01-26T01:17:51+05:30 IST