Share News

సృజనాత్మకతకు వేదిక జిల్లా విద్యా వైజ్ఞానిక సదస్సు

ABN , Publish Date - Dec 24 , 2023 | 01:32 AM

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సరైన వేదిక జిల్లా విద్యా వైజ్ఞానిక సదస్సు అని రామచంద్రపురం ఉపవిద్యాశాఖాధికారి శ్రీపాద లక్ష్మీ నర సింహఫణి అన్నారు.

సృజనాత్మకతకు వేదిక జిల్లా విద్యా వైజ్ఞానిక సదస్సు

రామచంద్రపురంలో ముగిసిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన.. 9 ప్రాజెక్టులు ఎంపిక

రామచంద్రపురం, డిసెంబరు 23 : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సరైన వేదిక జిల్లా విద్యా వైజ్ఞానిక సదస్సు అని రామచంద్రపురం ఉపవిద్యాశాఖాధికారి శ్రీపాద లక్ష్మీ నర సింహఫణి అన్నారు. స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వోన్నత పాఠశాలలో రెండు రోజు లపాటు నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన శనివారం సాయంత్రం ముగిసింది. తన అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో డీవైఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లోని మేధోసంపత్తికి సృజనాత్మకత తోడైతే అద్భుతాలు సాధించవచ్చన్నారు. జిల్లా సైన్స్‌ అధికారి జీవీఎస్‌ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మూడు విభాగాల నుంచి రాష్ట్ర స్థాయికి 9 ప్రాజెక్టులు ఎంపికైనట్టు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 88 పాఠశాలల నుంచి 93 ప్రాజెక్టులు ప్రదర్శించగా విద్యార్థుల వ్యక్తిగత గ్రూపు, ఉపాధ్యాయ విభాగాల్లో ప్రదర్శించిన ప్రాజెక్టుల్లో ప్రతి విభాగం నుంచి మూడు ప్రాజెక్టులు ఎంపిక చేశామన్నారు. ఇండియన్‌ బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ గన్నమని చక్రవర్తి సౌజన్యంతో ప్రతి విభాగంలో ఒక్కొక్కరికీ రూ.2వేల నగదు బహుమతి అందజేశామన్నారు. కేవీఆర్‌ హాస్పటల్‌ డాక్టర్‌ కె.నాగవెంకట సత్యనారా యణ మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్షా సెక్టొరియల్‌ అధికారులు డి.రమేషు బాబు, పిల్లి రాంబాబు, డాక్టర్‌ భీమా రావు, ఎంవీవీ సత్యనారాయణ, మండల విద్యాశాఖాధికారులు మానుపూడి శ్రీనివాస్‌, వాసంశెట్టి నాగేశ్వరి, పి.శాలెంరాజు, నాయుడు రామచంద్రరావు, ప్రధానో పాధ్యాయులు పోలిశెట్టి రాంబాబు, రామచంద్రపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాదంశెట్టి శ్రీదేవి, మండ పేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పతివాడ నూకదుర్గాభవాని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

.

Updated Date - Dec 24 , 2023 | 01:32 AM