జీవన నైపుణ్యానికి క్రీడలే సోపానం

ABN , First Publish Date - 2023-06-07T00:53:27+05:30 IST

ప్రతి విద్యార్థి తనలోని అంతర్గత శక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవడం వల్ల శారీరక దారుఢ్యం మాత్రమే కాకుండా జీవన నైపుణ్యాలను పెంపెందించుకోగలుగుతారని ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజబాబు అన్నారు.

జీవన నైపుణ్యానికి క్రీడలే సోపానం

రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 6 : ప్రతి విద్యార్థి తనలోని అంతర్గత శక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవడం వల్ల శారీరక దారుఢ్యం మాత్రమే కాకుండా జీవన నైపుణ్యాలను పెంపెందించుకోగలుగుతారని ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజబాబు అన్నారు. డిస్ర్టిక్టు స్పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ ప్రాంగణంలో చీఫ్‌ కోచ్‌ శేషగిరిరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఫుట్‌బాల్‌ వేసవి శిక్షణ శిబిరం ముగింపు సభలో ఆయన మాట్లాడారు. తమను తాము మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు ఆటలు తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా పరిశోధకుడు సుంకర నాగేంద్రకిషోర్‌, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్‌ డీవీ రామమూర్తి, గిరిధారి ప్రాజెక్ట్సు అధ్యక్షుడు సుంకర గౌతమ్‌కుమార్‌, తెలుగుశాఖాధిపతి పీవీబీ సంజీవరావు, శిబిరం కన్వీనర్‌ గంగాధరరావు, పీఏ కిషోర్‌బాబు, మణికంఠ, రామచంద్ర, శివాజీ, సీహెచ్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:53:27+05:30 IST