అధ్వాన రహదారులపై దారెటు?
ABN , First Publish Date - 2023-11-20T00:26:29+05:30 IST
రహదారుల అధ్వాన దుస్ధితిపై గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ- జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఆదివారం టీడీపీ-జనసేన నాయకులు గుంతల రహదారుల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో నిరసన
ఎటపాక, నవంబరు 19: రహదారుల అధ్వాన దుస్ధితిపై గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ- జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఆదివారం టీడీపీ-జనసేన నాయకులు గుంతల రహదారుల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. గుండాల కాలనీ గ్రామంలో గుంతలు పడిన అంతర్గత రహదారిపై ట్రాక్టర్‌పై ప్రయాణించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షుడు పుట్టి రమేష్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మారాసు గంగాధర్ మాట్లాడారు. నాలుగున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రహదారి కూడా అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. అధ్వాన రహదారులతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ- జనసేన నాయకులు గొమ్ముకొత్తగూడెం ఎంపీటీసీ పాయందేవి, నలజాల మధు, ఎడ్ల లోకేష్, రూప, ముత్యం సురేష్‌గౌడ్, రాసాల నర్సింహారావు పాల్గొన్నారు.