Share News

అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2023-11-22T00:11:13+05:30 IST

శబరిమలై క్షేత్రానికి వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కాకినాడ-కొట్టాయం మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఈ నెల 23,30లలోనూ, కొట్టాయం-కాకినాడ మధ్య ఈ నెల 25, డిసెంబరు 2న నడపనున్నట్లు ఎస్‌సీ రైల్వే డివిజనల్‌ పీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

సామర్లకోట, నవంబరు 21: శబరిమలై క్షేత్రానికి వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కాకినాడ-కొట్టాయం మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఈ నెల 23,30లలోనూ, కొట్టాయం-కాకినాడ మధ్య ఈ నెల 25, డిసెంబరు 2న నడపనున్నట్లు ఎస్‌సీ రైల్వే డివిజనల్‌ పీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 07125 నంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు కాకినాడ టౌన్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కొట్టాయంనకు 23,30 రాత్రి 10 గంటలకు బయలుదేరుతుంది. 07126 నంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు కొట్టాయం నుంచి కాకినాడ టౌన్‌కు ఈ నెల 25 డిసెంబరు 2న తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు సామర్లకోట, అనపర్తి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్‌, తిరుపూర్‌, కొయంబత్తూరు, పాలక్కాడ్‌, త్రిచూర్‌, అలువాల మీదుగా ఎర్నాకుళం చేరుకుంటుంది. ఈ రైలులో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలు అందుబాటులో ఉన్నట్లు పీఆర్వో రాకేష్‌ తెలిపారు. అయ్యప్ప భక్తులు గమనించాలని కోరారు.

Updated Date - 2023-11-22T00:11:14+05:30 IST