‘స్పందన’ సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:55 PM
ప్రజా సమస్యల పరిష్కారవేదిక స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణంగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత ఆదేశించారు.
ఈ ఏడాది ఇదే చివరి స్పందన : కలెక్టర్
మళ్లీ 2024 జనవరి 1న స్పందన
రాజమహేంద్రవరం సిటీ/రూరల్, డిసెంబరు 18 : ప్రజా సమస్యల పరిష్కారవేదిక స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణంగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందనలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను జేసీ తేజ్ భరత్, ఎస్పీ పి.జగదీశ్, కమిషనర్ దినేష్ కుమార్ స్వీకరించారు. బాధితుల సమస్యలను విని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. స్పందనలో ఆన్‌లైన్‌లో 160 అర్జీలు, ఆప్‌లైన్‌లో 11 వచ్చాయని తెలిపారు.ఈ నెలలో ఇదే చివరి స్పందన కార్యక్రమని అధికారులే ప్రకటించారు. ప్రభుత్వ సెలవులు ఉండడంతో 2024 జనవరి 1న సోమవారం స్పందన ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో నరసింహులు, పర్యాటక ప్రాంతీయ సంచాలకులు వి స్వామినాయుడు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం.భాను ప్రకాష్ రెడ్డి, పి.సువర్ణ, డీఎంహెచ్‌వో డాక్టర్ కె.వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
28 అర్జీలు స్వీకరించిన ఎస్పీ
రాజమహేంద్రవరం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రత్యేక స్పందనకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను సత్వ రమే పరిష్కరించాలని ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. సివిల్, భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, మిస్సింగ్ తదితర అంశాలపై 28 ఫిర్యాదులను ఎస్పీకి బాధితులు సమర్పించారు. ఎక్కువగా సివిల్ తగా దాలు, భూవివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఆ ఫిర్యాదుదారులు రాజీమార్గాన్ని అవలంభించడం, సామరస్య చర్చల ద్వారా వేగంగా సమస్య పరిష్కారానికి ఆస్కారం ఉంటుందని సూచించారు.
ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు
ఆరోగ్యశ్రీ పథకం వైద్య సేవలు పొందే పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచినట్టు కలెక్టర్ మాధవీలత తెలిపారు. తాడేపల్లి నుంచి సీఎం జగన్ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేన్సర్ చికిత్స, ఇతర అత్యంత ఖరీదైన వైద్య చికిత్సకు పరిమితి లేకుండా వైద్య సహాయం అం దుతుందన్నారు.3,257 రకాల రోగాలకు ఇది వర్తిస్తుందన్నారు. ఎస్పీ పి.జగ దీశ్ మాట్లాడుతూ దిశయాప్, ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో కుటుంబీకుల వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, కమిషనర్ కె.దినేష్‌కుమార్, ఆరోగ్యశ్రీ కోఆ ర్డినేటర్ ప్రియాంక, జీజీహెచ్ సూపరింటెండెంట్ సూర్యప్రభ పాల్గొన్నారు.