ఉపాధి పనులపై సామాజిక తనిఖీ

ABN , First Publish Date - 2023-03-20T00:06:58+05:30 IST

మండల పరిషత్‌ సమావే శ మందిరంలో ఆదివారం మహత్మగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులపై ప్ర జావేదికను నిర్వహించారు. జిల్లాస్థాయి అధికారుల సమక్షంలో నిర్వహించిన బహిరంగ సమీక్షలో ఎస్‌ఆర్‌పీలు సామాజిక తనిఖీలో బయటపడిన నివేదికలను వెల్లడించారు. మండలంలోని 23 గ్రామాల పరిధిలో 2021-22లో జరిగిన ఉపా ధి పనులపై సామాజిక తనిఖీ జరిగింది. వివిధ శాఖల ద్వారా రూ.11కోట్ల41లక్షల26వేల962లు విలువచేసే 825 పనులు చేయగా కూలీలకు 3,05,077 పనిదినాలు కల్పించారు. కూలీల వేతనాల

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ
కరపలో సమీక్ష జరుపుతున్న డ్వామా పీడీ

కరప, మార్చి 19: మండల పరిషత్‌ సమావే శ మందిరంలో ఆదివారం మహత్మగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులపై ప్ర జావేదికను నిర్వహించారు. జిల్లాస్థాయి అధికారుల సమక్షంలో నిర్వహించిన బహిరంగ సమీక్షలో ఎస్‌ఆర్‌పీలు సామాజిక తనిఖీలో బయటపడిన నివేదికలను వెల్లడించారు. మండలంలోని 23 గ్రామాల పరిధిలో 2021-22లో జరిగిన ఉపా ధి పనులపై సామాజిక తనిఖీ జరిగింది. వివిధ శాఖల ద్వారా రూ.11కోట్ల41లక్షల26వేల962లు విలువచేసే 825 పనులు చేయగా కూలీలకు 3,05,077 పనిదినాలు కల్పించారు. కూలీల వేతనాలకు రూ.7,60,89,115లు, మెటీరియల్‌కు రూ.3,80,37,846లు చెల్లించారు. ఆయా పనులపై నిర్వహించిన సోషల్‌ ఆడిట్‌లో చివరకు పలువురు ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రూ.4వేలు ఫైన్‌ విధించారు. పంచాయతీరాజ్‌శాఖ పనుల నుంచి రూ.5,44,730లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ పనుల నుంచి రూ.4,46,748లు రికవరీ చేయాలని ఆడిట్‌ అధికారులు ఆదేశించారు. ఉపాధి సిబ్బంది పనుల నిర్వహణలో పలు లోపాలను గుర్తించినట్టు డీఆర్‌పీలు రాజు, దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఉపాధి పనుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను డ్వామా పీడీ వెంకటలక్ష్మి వివరించారు. ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మిసత్తిబాబు, ఉపాధి పథకం జిల్లా అంబుడ్స్‌మన్‌ అధికారి ఎం.జ్యోతి, ఏపీఎ్‌సఎ్‌సఏఏటీ కోఆర్డినేటర్‌ జి.శ్రీకాంత్‌, ఏపీడీ పి.వసంతమాధవి, ఎంపీడీవో కర్రె స్వప్న, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలు గండ్రేటి శైలజ, వి.వర్ధన్‌, ఏపీవో జీవీ రమణకుమార్‌, జేఈ నాగలోవ, టీలు ప్రకాష్‌, రాజేందర్‌ పాల్గొన్నారు.

తాళ్లరేవులో...

తాళ్లరేవు, మార్చి 19: మండలంలో 2021-22 సంవత్సరానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం ద్వారా చేసిన పనులకు సామాజిక తనిఖీ ప్రజావేదిక ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన ఆదివారం తూతూమంత్రంగా జరిగింది. ద్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై సోషల్‌ ఆడిటర్ల నివేదికలపై రిపోర్టులను రాశారు. ఉపాధి కూలీలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. సోషల్‌ ఆడిటర్లు, ఫీల్డు అసిస్టెంట్లు, మేట్లు, సచివాలయ సిబ్బందితో ప్రజావేదిక జరిగింది. అమృ్‌సమేన్‌ జ్యోతి, ఎంపీడీవో ఎమ్‌.అనుపమ, ఎపీవో అన్నపూర్ణ ఉన్నారు.

Updated Date - 2023-03-20T00:06:58+05:30 IST