సైబర్‌ నేరాలు నిరోధించేందుకు సమష్టి కృషి చేద్దాం

ABN , First Publish Date - 2023-06-14T01:18:24+05:30 IST

జిల్లాలో సైబర్‌ నేరాలు అరికట్టేందుకు సమష్టిగా కృషి చేద్దామని జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఎస్‌.ఖాదర్‌బాషా పిలుపునిచ్చారు.

సైబర్‌ నేరాలు నిరోధించేందుకు సమష్టి కృషి చేద్దాం

అమలాపురం టౌన్‌, జూన్‌ 13: జిల్లాలో సైబర్‌ నేరాలు అరికట్టేందుకు సమష్టిగా కృషి చేద్దామని జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఎస్‌.ఖాదర్‌బాషా పిలుపునిచ్చారు. ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పట్టణ పరిధిలోని జాతీయ, ప్రైవేటు బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సైబర్‌క్రైమ్స్‌, లోన్‌ యాప్‌ లకు సంబంధించిన నేరాలు, బ్యాంకు లావాదేవీల్లో జరిగే మోసపూరిత కేసుల దర్యాప్తులో బ్యాంకు అధికారులు సహక రించాలన్నారు. కేవైసీ మార్గదర్శకాలు పాటించి బయో మెట్రిక్‌ ద్వారా ఖాతాదారులవివరాలు నిక్షిప్తం చేయాలన్నారు. పబ్లిక్‌ సేఫ్టీ యాక్టు ప్రకారం బ్యాంకు ఆవరణలో సీసీ కెమె రాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఓటీపీ నేరాల గురించి ఖాతాదారులకు అవగాహన కల్పించడంతో పాటు సెక్యూరిటీ గార్డులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఏటీఎం సెంటర్‌ల వద్ద టోల్‌ఫ్రీ నంబరు 1930 ప్రదర్శించే విధంగా బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టాలి, ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలు ఖచ్చితంగా పనిచేసేలా చూడాలన్నారు. సమా వేశంలో జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ కె.శ్యామ్‌బాబు, డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్‌, పట్టణ, రూరల్‌ సీఐలు డి.దురా ్గశేఖర్‌ రెడ్డి, పి.వీరబాబు, వివిధ బ్యాంకులఅధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-14T01:18:24+05:30 IST