Share News

హామీలు అమలు చేయాల్సిందే!

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:18 PM

అంగన్వాడీ కార్యకర్తలకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూ నియన్‌ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్‌ మాణిక్యమ్మ డిమాండ్‌ చేశారు. సోమవారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం వద్ద డివిజన్‌ పరిధిలోని 9 మండలాల అంగన్వాడీ కార్యకర్తలు 7వ రోజు సమ్మెలో పాల్గొన్నారు.

హామీలు అమలు చేయాల్సిందే!
కొవ్వూరులో ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్వాడీలు

  • కొవ్వూరులో అంగన్వాడీల నిరసన, ర్యాలీ

  • పాల్గొన్న డివిజన్‌ పరిధిలోని కార్యకర్తలు, ఆయాలు

కొవ్వూరు, డిసెంబరు 18: అంగన్వాడీ కార్యకర్తలకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూ నియన్‌ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్‌ మాణిక్యమ్మ డిమాండ్‌ చేశారు. సోమవారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం వద్ద డివిజన్‌ పరిధిలోని 9 మండలాల అంగన్వాడీ కార్యకర్తలు 7వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయం నుంచి మెరకవీధి వరకు ర్యాలీ చేపట్టారు. మానవహారం నిర్వహించారు. సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు మాట్లాడుతూ ప్రభుత్వం హామీలను అమలు చేయకపోగా అవాస్తవాలు ప్రచారం చేయడం తగదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ, కనీస వేతనం రూ.26,000 అందజేయాలని డిమాండ్‌ చేశారు. మాణిక్యమ్మ మాట్లాడుతూ ఆయాల ప్రమోషన్లలో వయోపరిమితి 50 ఏళ్లకు పెంచాలని, మినీవర్కర్లను మెయిన్‌ వర్కర్లగా గుర్తించి వేతనాలు, ప్రమోషన్లు కల్పించాలన్నారు. ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ను రద్దు చేయాలని, బీమా అమలు చేయాలని, రిటైర్డ్‌మెంటు బెనిఫిట్స్‌ రూ.5 లక్షలకు పెంచాలని, వేతనంలో సగం పింఛను అందించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ భ్యుడు జువ్వల రాంబాబు, దగ్గు రాధాకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లేపల్లి నరసింహమూర్తి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కె.భాస్కర్‌, కార్యదర్శి ఎస్‌.రాజా, ఐఎఫ్‌టీయూ నా యకుడు గ్రీష్మకుమార్‌, పీవోడబ్ల్యు నాయకురాలు ఈమని మల్లిక, పెనుమాక జయరాజు అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌.భగత్‌, గంటి కృష్ణ, అంగన్వాడీ కొవ్వూ రు, పెరవలి, గోపాలపురం ప్రాజెక్టు నాయకులు ఆర్‌.జ్యోతి, కె.భాస్కరం, వసంతాడ శ్రీదేవి, చీర దుర్గాభవాని, బొందలపాటి పద్మజ, ఆలమండ నరసమాంభ, నేతల శాంతకుమారి, వేలంగి మదురవల్లి, దుమ్మ అమరావతి పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:18 PM