Share News

కిరాణా షాపు దగ్ధం

ABN , First Publish Date - 2023-12-11T00:23:09+05:30 IST

పెద్దాపురం, డిసెంబరు 10: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో కిరాణా దుకాణం దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని కాండ్రకోటలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఏడీ ఎఫ్‌వో ఎం.శ్రీహరి జగన్నాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాబోలు సత్యకృష్ణకు చెందిన కిరాణా దుకాణంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ సంభవిం

కిరాణా షాపు దగ్ధం

పెద్దాపురం, డిసెంబరు 10: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో కిరాణా దుకాణం దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని కాండ్రకోటలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఏడీ ఎఫ్‌వో ఎం.శ్రీహరి జగన్నాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాబోలు సత్యకృష్ణకు చెందిన కిరాణా దుకాణంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించడం తో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో దుకా ణం మూసివేసి ఉండడంతో దుకాణంలో సామాన్లు మొత్తం కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. లక్ష మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిపారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి మంటలను అదుపుచేశారు.

Updated Date - 2023-12-11T00:23:10+05:30 IST