సీనియర్ ఇంటర్ ఇంగ్లీషు పరీక్షకు 43,503 మంది హాజరు
ABN , First Publish Date - 2023-03-19T02:41:55+05:30 IST
ఉమ్మడి తూర్పుగోదావరి, కొవ్వూరు డివిజన్‌లో ప్రారంభమైన సీనియర్ ఇంటర్ పరీక్షలకు 43,503 మంది విద్యార్థులు హాజరయ్యారు.

1499 మంది విద్యార్థులు గైర్హాజరు
తూర్పుగోదావరిలో ఒక మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 18: ఉమ్మడి తూర్పుగోదావరి, కొవ్వూరు డివిజన్‌లో ప్రారంభమైన సీనియర్ ఇంటర్ పరీక్షలకు 43,503 మంది విద్యార్థులు హాజరయ్యారు. గురువారం 140 పరీక్ష కేంద్రాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీషు పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం జనరల్ విభాగం 45,002 మంది, ఒకేషనల్ విభాగంలో 4638 మంది హాజరు కావాల్సిఉంది. 1499 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాల వారీగా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో 47 పరీక్షా కేంద్రాల్లో జనరల్ విభాగంలో 14902 మంది విద్యార్థులకు 14723 మంది పరీక్షలు రాశారు. 179 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగాంలో 1669 మందికి 1576 మంది పరీక్షలు రాశారు. 93 మంది గైర్హాజరయ్యారు. ఒక పరీక్షా కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది. కాకినాడ జిల్లాలో 60 సెంటర్లలో జరిగిన పరీక్షలకు 16,732 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 16,246మంది పరీక్షలు రాశారు. 486 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 1354 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 1304 మంది హాజరయ్యారు. 50 మంది గైర్హాజరయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 38 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు జనరల్‌లో 10,850 మందికి 10,302 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 548 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 2060 మందికి 1926 మంది పరీక్షలు రాశారు. 134 మంది గైర్హాజరయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 పరీక్ష కేంద్రాల్లో 1979 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 1889 మంది హాజరయ్యారు. 90 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 227 మందికి 215 మంది పరీక్షలు రాశారు. 12 మంది గైర్హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలో సిట్టింగ్ ,ఫ్లయింగ్ స్క్వాడ్‌లు శనివారం 81 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారని ఇంటర్ ఆర్‌ఐవో ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహం తెలిపారు.