‘పరివర్తన’ రాకుంటే జైలుకే
ABN , First Publish Date - 2023-03-19T01:30:20+05:30 IST
సారా, గంజాయి తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు తక్షణమే వాటిని నిలిపివేయాలని..పరివర్తన రాకుంటే జైలుకు తప్పదని ఎస్‌ఈబీ ఏఈఎస్ ఎం.రాంబాబు స్పష్టం చేశారు.

మారతామంటే ఉపాధి చూపిస్తాం.. లేదంటే కేసు
సెబ్ ఏఈఎస్ రాంబాబు
రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), మార్చి 17: సారా, గంజాయి తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు తక్షణమే వాటిని నిలిపివేయాలని..పరివర్తన రాకుంటే జైలుకు తప్పదని ఎస్‌ఈబీ ఏఈఎస్ ఎం.రాంబాబు స్పష్టం చేశారు. సౌత్‌జోన్ సెబ్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మూడు నెలల్లో 313 కేసులు నమోదు చేసి 402 మందిని అరెస్ట్ చేసి 28 వాహనాలను సీజ్ చేశామన్నారు.2820 లీటర్ల సారా,694 కిలోల బెల్లం, 471 లీటర్ల అక్రమ మద్యం, 31450 లీటర్ల బెల్లపు ఊట స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు.33 మందిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి బెల్లం వ్యాపారాలు చేస్తున్న వారిపై పీడీ యాక్ట్‌కింద 17 కేసులు నమోదు చేయగా 8 మందికి కోర్టు రిమాండ్ విధించిందన్నారు. సారా, గంజాయి వంటి మత్తు పదార్థాల సమాచారాన్ని 14500 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. ఎన్నిసార్లు చెప్పినా సారా విక్రయం,తయారీ ఆపకపోవడంతో వడిశలేరుకు చెందిన బొమ్మోతుల ఏసుబాబుపై పీడీ యాక్టు పెట్టి శనివారం కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించామని రంగంపేట సెబ్ సీఐ వెంకటలక్ష్మి తెలిపారు.రాజమహేంద్రవరం సెబ్ సౌత్‌జోన్ సీఐ హనుశ్రీ మాట్లాడుతూ జోన్ పరిధిలో పరివర్తన చెందిన 36 మంది ఉపాధికి సిఫారసు చేశామన్నారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మానుకో వాలని రాజమహేంద్రవరంసెబ్‌నార్త్‌జోన్ సీఐ వెంకటరమణ సూచించారు.