మాదిగలకు అసెంబ్లీ సీటు కేటాయించాలి

ABN , First Publish Date - 2023-06-07T01:01:12+05:30 IST

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ప్రధాన రాజకీయ పార్టీలను డాక్టర్‌ బాబూజగ్జీవన్‌రామ్‌ వెల్ఫేర్‌ సొసైటీ కమిటీ డిమాండు చేసింది.

మాదిగలకు అసెంబ్లీ సీటు కేటాయించాలి

అమలాపురం రూరల్‌, జూన్‌ 6: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ప్రధాన రాజకీయ పార్టీలను డాక్టర్‌ బాబూజగ్జీవన్‌రామ్‌ వెల్ఫేర్‌ సొసైటీ కమిటీ డిమాండు చేసింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మూడు రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో ఒక స్థానాన్ని మాదిగలకు ఇవ్వాలని టీడీపీ, జన౉ సనలను డిమాండు చేసింది. నడిపూడి కమ్యూనిటీ హాలులో జిల్లా కన్వీనర్‌ తొత్తరమూడి ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు కాప నాగభూషణం, చాట్ల సత్యనారాయణ, మంద వెంకటేశ్వర రావు, మోకాటి అమ్మి రాజు, ఉందుర్తి సత్యనారాయణ, నేదునూరి నతానియేలు, కొడమంచిలి కృష్ణ, సవరపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T01:01:12+05:30 IST