ఎస్పీపై చర్యలు తీసుకుంటాం
ABN , First Publish Date - 2023-06-26T01:09:39+05:30 IST
జిల్లా పోలీసులు దళితుల పట్ట కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ధ్వజమెత్తారు.
రాజమహేంద్రవరం సిటీ, జూన్ 25: జిల్లా పోలీసులు దళితుల పట్ట కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ధ్వజమెత్తారు. తిరుమలాయపాలెం గ్రామానికి నిత్యావసరాల తరలింపును అడ్డుకున్న సంఘటన తెలుసుకున్న ఆయన ఆదివారం రాజమహేంద్రవరం వచ్చి దళిత పోరాట కమిటీ నాయకుడు అజ్జరపు వాసు ఇంటికి వెళ్ళారు. సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులను ఆదుకునేందుకు వెళుతుంటే అడ్డంకులు ఎందుకు సృష్టించారని పోలీసులను ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ ఆది నుంచి దళిత వ్యతిరేకిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ గతంలో రావులపాలెంలో టిఫిన్ తినే పేపరు ప్లేట్‌లో అంబేడ్కర్ పొటో వేసినందుకు ఆ వ్యాపారిని దళిత యువకులు నిలదీస్తే ఆ యువకులపై కేసులు పెట్టి వేధించార న్నారు. ఇప్పుడు తిరుమలాయపాలెం ఘటనలో దళితులపై దాడు లు చేయడమేకాకుండా బాధితులను ఆదుకునేందుకు వెళుతున్న వారిని అరెస్టులు చేశా రన్నారు. దీనిని ఎస్సీ కమిషన్ క్షమించదని హెచ్చరించారు.ఎస్పీపై తగు చర్య లు తీసుకుంటామని చెప్పారు.తిరుమలాయపాలెం దళితులపై దాడులు చేసిన పెత్తందార్లపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట కాశి నవీన్ కుమార్, మర్రి బాబ్జి,పరమట గణేశ్వరరావు,భానుచందర్, జువ్వల రాం బాబు, రాంబాబు ,బొర్ర చిన్ని, కప్పల వెలుగు కుమారి, ఖండవల్లి లక్ష్మి, తాళ్ళూ రి బాబు రాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి, విజ్జిన మధు ఉన్నారు. వారంతా నిత్యావసర సరుకులు తీసుకుని తిరుమలాయపాలెం వెళ్ళారు.