Share News

సత్యదీక్షలు స్వీకరించాల్సిందే

ABN , First Publish Date - 2023-10-30T23:57:20+05:30 IST

అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న అన్ని కేటగిరిల ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌, రెమ్యునరేషన్‌పై పనిచేస్తున్న సిబ్బంది, దేవస్థానంపై దుకాణసముదాయాలు లీజుకు తీసుకున్న లైసెన్స్‌దారులు, వారి సిబ్బంది తప్పనిసరిగా సత్యదీక్షలు స్వీకరించాలని ఈవో చంద్రశేఖర ఆజాద్‌ సర్క్యులర్‌ జారీచేశారు.

సత్యదీక్షలు స్వీకరించాల్సిందే

అన్నవరం, అక్టోబరు 30: అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న అన్ని కేటగిరిల ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌, రెమ్యునరేషన్‌పై పనిచేస్తున్న సిబ్బంది, దేవస్థానంపై దుకాణసముదాయాలు లీజుకు తీసుకున్న లైసెన్స్‌దారులు, వారి సిబ్బంది తప్పనిసరిగా సత్యదీక్షలు స్వీకరించాలని ఈవో చంద్రశేఖర ఆజాద్‌ సర్క్యులర్‌ జారీచేశారు. హిందూ ధర్మప్రచారంలో భాగంగా సత్యదీక్షల విస్తృతి, భక్తుల మన్ననలు పొందేందుకు ప్రతి ఆడ, మగ ఉద్యోగులు భక్తిపూర్వకంగా సత్యదీక్షలు ఆచరించాలని సూచించారు. ఈ దీక్షలు ఉద్యోగుల అవకాశాన్ని బట్టి 27 రోజులు, 18 రోజులు, 9 రోజులు చేపట్టవచ్చునని 27 రోజులు దీక్ష తీసుకునేవారు నవంబరు 7న, 18 రోజుల దీక్షను తీసుకునేవారు నవంబరు 16న, 9 రోజుల దీక్షను తీసుకునేవారు నవంబరు 25న మాలధారణ చేయాలని సూచించారు. వీరంతా డిశంబరు 4న దీక్షా విరమణ చేయాల్సి ఉంటుందని వైదిక కమిటీ సూచించింది. దీక్షలు ప్రారంభమై సుమారు 22 ఏళ్లు గడుస్తున్నా మొదట్లో దేవస్థానం ఉద్యోగులు అందరూ వేయాలని అప్పటి కార్యనిర్వహణాధికారి మౌఖిక ఆదేశాలతో చాలామంది ఉద్యోగులు దీక్ష స్వీకరించారు. మళ్లీ చాలాకాలం తర్వాత ఈవో చంద్రశేఖర ఆజాద్‌ సర్క్యులర్‌ ఆదేశాలు జారీ చేయడం విశేషం. అయితే ఈవో ఆదేశాలను సిబ్బంది ఎంతమేరకు గౌరవిస్తారో వేచి చూడాలి.

Updated Date - 2023-10-30T23:57:20+05:30 IST