గోదారి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2023-01-11T09:37:39+05:30 IST

తెలుగు లోగిళ్లల్లో జరుపుకునే సంక్రాంతి సంబరాలు (Sankranti celebrations) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ గోదావరి జిల్లాల వాసులు ఈ వేడుకలను అంగరంగ

గోదారి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి సంబరాలు
మొదలైన సంక్రాంతి సంబరాలు

ఆరు టన్నుల గో పేడతో గుమ్మిలేరులో కిలోమీటరు భోగి దండ

తెలుగు లోగిళ్లల్లో జరుపుకునే సంక్రాంతి సంబరాలు (Sankranti celebrations) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ గోదావరి జిల్లాల వాసులు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ జిల్లాల్లో కూడా కొన్ని గ్రామాల్లో సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి గ్రామాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema) ఆలమూరు మండలం గుమ్మిలూరు గ్రామం ఒక్కటి. పశుపోషణకు దేశం (India)లోనే ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామంలోని గోవుల పేడను సేకరించి ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ బోగిదండను తయారు చేస్తుంటారు. భోగి (Bhogi)దండ అంటే చిన్న పిల్లల చేతిలో పట్టుకుని వేసే రెండు మూడడుగులది కాదండోయ్. ఏకంగా కిలోమీటరు పొడవైన దండను తయారు చేసి భోగి వేడుకకు సిద్దం చేసారు. ఈ దండ తయారీకి ఆరు టన్నుల గో పేడను వినియోగించారు.

ఆ పల్లెలో కోలాహలంగా బోగి పండుగ

బాజాభజంత్రీలు, కోలాట నృత్యాలు, బాణాసంచ కాల్పుల మధ్య ఈ భోగి దండను గ్రామస్తులందరూ ఊరేగింపుగా తీసుకెళ్లి మంటల్లో వేసే దృశ్యాలు సంక్రాంతి సంబరాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. దేశ విదేశాల నుంచి సంక్రాంతి పండుగకు సొంతూరు వచ్చే వారందరూ ఈ వేడుకలు చూడటానికి వస్తారు. అలాగే అనేక మీడియా ఛానల్స్ కెమెరాలు గుమ్మిలేరు గుమ్మంలో వాలతాయి. ఈ సుందర దృశ్యాలు ప్రపంచానికి చూపించడానికి పోటీ పడుతుంటారు. సంస్కృతి సాంప్రదాయాలకు ఆ ఊరు పెట్టింది పేరుగా చెప్పవచ్చు. ప్రతి ఎటా భోగి పండుగకు గుమ్మిలేరు గ్రామం ప్రత్యేక గుర్తింపు పొందుతుంది. ఆరేళ్లుగా ఈ భోగి దండను ప్రత్యేకంగా తయారు చేస్తూ ఆ గ్రామస్తులు పురాతన సంస్కృతీ సంప్రదాయాలు,పండుగల గోడలకు బీటలు వారకుండా కాపాడుతున్నారు.అందుకునే ఎంత కష్టమైనప్పటికీ ఈ బోగి పిడకల దండను తయారు చేస్తున్నారు. చింతలూరు గోశాలతో పాటు గుమ్మిలేరు (Gummileru)లో పెద్ద పాడి రైతుల నుంచి ఈ ఆవు పేడను సేకరించి ఇంటికో మహిళ చొప్పున వచ్చి పిడకలు తయారు చేసారు. వాటిని ఎండబెట్టి ఆరిన తర్వాత దండగా తయారు చేశారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఈ బోగి పిడకల తయారీలో ఆ గ్రామస్తులు, రైతులు, మహిళలు నిమగ్నమయ్యారు. మండపేట పట్టణం సమీపంలో గల ఈ గ్రామం అచ్చ పల్లెటూరుకు జిరాక్స్ లా ఉంటుంది. ఒక్క సంక్రాంతే కాదు ప్రతి పండుగలను ఆ గ్రామంలో పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలతో నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

Updated Date - 2023-01-11T09:37:41+05:30 IST