Share News

తవ్వుకుంటాం.. దోచుకుంటాం.. తగ్గేదేలే!

ABN , First Publish Date - 2023-11-20T00:19:22+05:30 IST

ఎవరు ఏమన్నా తగ్గేదేలే.. అంతా మా ఇష్టం.. తవ్వుకుంటాం.. దోచుకుంటాం.. దాచుకుంటాం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏకంగా ర్యాంపులను పరిశీలించి విమర్శించినా.. మాకేం పట్టదు..

తవ్వుకుంటాం.. దోచుకుంటాం.. తగ్గేదేలే!
బల్లిపాడు ఇసుక ర్యాంపు వద్ద ఆందోళన చేస్తున్న యువగళం సభ్యులు తదితరులు

మళ్లీ గోదారిలో ఇసుక అక్రమ దోపిడీ

తెరుచుకున్న అన్ని ర్యాంపులు

నోటిమాటగా అధికారులకు ఆదేశం

6.75 లక్షల టన్నుల ఇసుక తీత?

టన్ను ధర రూ.625గా నిర్ణయం

మే 5వ తేదీతో ముగిసిన గడువు

అయినా 6 నెలలుగా తవ్వకం

ఎవరు ఏమన్నా తగ్గేదేలే.. అంతా మా ఇష్టం.. తవ్వుకుంటాం.. దోచుకుంటాం.. దాచుకుంటాం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏకంగా ర్యాంపులను పరిశీలించి విమర్శించినా.. మాకేం పట్టదు.. దులిపేసుకుంటాం.. మా పని మేం చేసుకుపోతాం.. మా ప్రభుత్వంలో అక్రమమైతేనే సక్రమమం అంటూ వైసీపీ నాయకులు మళ్లీ ఇసుక దోపిడీకి తెరలేపారు.. ఏకంగా 25 డీసిల్టేషన్‌ ర్యాంపులను అనధికార అనుమతులు తెచ్చారు.. ఎవరు ఇచ్చారు.. ఎలా వచ్చాయనే సమాధానం అధికారుల వద్దా లేదు.. తవ్వకాలు మాత్రం సాగిపోతూనే ఉన్నాయి..

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

ఇసుక దోపిడీ మళ్లీ మొదలైంది. వాస్తవానికి మే నెలలోనే జేపీ కాంట్రాక్టు సంస్థ ఒప్పంద గడువు ముగిసింది. అప్పటి నుంచి అనధికారికంగా ఇసుక దోపిడీ జరుగుతున్న సంగతి తెలిసిందే. అంటే ఏకంగా గత ఆరు నెలలుగా అనుమతులు లేకుండా ఇసుక డ్రెడ్జింగ్‌ సాగుతూనే ఉంది. ప్రతి రోజూ టన్నుల కొద్దీ ఇసుకను తరలించి కోట్లాదిరూపాయలు దోచుకున్నారు. ప్రభుత్వం ఈ నెల ఆరంభంలో ఇసుక ర్యాంప్‌లను అధికారికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఏపీఎండీసీకి అప్పగిస్తామని, కొత్త కాంట్రాక్టుకు టెండర్లు పిలిచినట్టు వైసీపీ ప్రభుత్వం రకరకాల కథలు చెప్పింది.అయితే ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ అధికారులకు మౌఖిక ఆదేశాల ఇస్తూ పాత కాంట్రాక్టర్లే కొనసాగించమని స్పష్టం చేసింది. మే నెల నుంచి ఇప్పటి వరకు రాజహేంద్రవరం వైపు గాయత్రి, కోటిలింగాల, కాతేరు ర్యాంప్‌లలో గుత్తాధిపత్యం చలాయించిన అనధికార లీజుదారుడికే మళ్లీ బాధ్యతలు అప్పగించా రు. గతంలో ఇదో విచిత్ర పరిస్థితిగా మారిన సంగతి తెలిసిందే. కొవ్వూరు వైపు ర్యాంప్‌లన్నీ ప్రేమ్‌ రాజు అనే వ్యక్తికి నెలకు రూ.30 కోట్లకు అప్పగించి అడ్వాన్స్‌గా రూ.30 కోట్లు వసూలు చేశారు.దీంతో ఆ తర్వాత నెలలో డబ్బులు చెల్లించలేక ఆ వ్యక్తి కొవ్వూరు రైలు పట్టాలపై తలపెట్టి బలవన్మరణం చెందిన సంగతి తెలిసిందే.ఈ కేసులు కూడా వెలుగు చూడాకుండా మాఫీ చేశారు. అదే తరహాలో రాజమహేంద్రవరం వైపు బోట్స్‌ మెన్‌ ర్యాంపులను ఒక వ్యక్తికి అప్పగించిన సం గతి తెలిసిందే. అతను బోట్లను పక్కన పడేసి రాత్రి వేళ గోదావరిలో డ్రెడ్జింగ్‌ చేసి కోట్లు దోచుకున్నాడు.మళ్లీ తిరిగి రాజమహేంద్రవరం ర్యాంప్‌లతో పాటు కొవ్వూరు ర్యాంప్‌లను కలిసి మొత్తం 25 ర్యాంప్‌లను అతనికే ప్రభుత్వం అప్పగించింది. ఒప్పందం ఎన్ని కోట్లు అనేది బయటకు రాలేదు. కానీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఇసుక తీత ఆరంభించాల్సిందిగా అన్ని ర్యాంప్‌లకు వర్తమానం అందింది. చాలా చోట్ల ఇసుక తీత మొదలైంది. మొత్తం అఖండ గోదావరిలో 6.75 లక్షల టన్నుల ఇసుక తీయడానికి ఒప్పంద కుదిరినట్టు సమాచారం. ఇక్కడ ఇసుక వెలికితీసే బోట్స్‌మెన్‌ సొసైటీలకు టన్నుకు కేవలం 150 ఇవ్వ డానికి కాంట్రాక్టరు మాత్రం టన్ను ఇసుకను రూ.625కు అమ్మడానికి నిర్ణయించారు. గతంలో బోట్స్‌ మెన్‌ సొసైటీలకు టన్నుకు రూ.200 ఇచ్చేవారు.కొంతకాలానికి తగ్గించేశారు.ప్రస్తుతం డ్రెడ్జింగ్‌ సన్నాహాలు చేస్తున్నారు. బోట్స్‌ మెన్‌ సొసైటీలు నిర్వహించుకునే చిన్నచిన్నవ్యక్తులకు ఉపాధిని మళ్లీ పాడు చేశారు. పడవలకు, ఇసుక తీత కార్మికులను మళ్లీ లేకుండా చేశారు. దీంతో వంద సంఖ్యలో ఉన్న బోట్స్‌మెన్‌ సొసైటీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. త్వరలో మరొక 25 ఓపెన్‌ ర్యాంప్‌లకు ఇదే తరహాలో అనుమతి రానున్నది. దీనిపై మైన్స్‌ ఇరిగేషన్‌ అధి కారులు కనీసం నోరు మొదపడం లేదు.

ఇసుక దోపిడీ ఆపాలని బల్లిపాడులో ఆందోళన

తాళ్ళపూడి, నవంబరు 19 : బల్లిపాడు ఇసుక ఓపెన్‌ రీచ్‌లో ఇసుక మాఫియా వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని భారీ లారీల కారణంగా రోడ్డు గోతులమ యమై ప్రమాదాలకి గురవుతున్నారని టీడీపీ యువగళం సభ్యుడు కాకర్ల సత్యేంద్ర ఆరో పించారు.ఇసుక ర్యాంప్‌ వద్ద అక్రమ మైనింగ్‌ ఆపాలని యువ గళం సభ్యులు, మహిళలు లారీలను ఆపి ఆందోళన చేశారు. కొద్ది సేపటికి మైనింగ్‌ ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌నంటూ ఒక వ్యక్తి వచ్చాడు. అక్రమంగా ఇసుక తీసుకువెళుతున్న లారీలను తనిఖీ చేసి వారి బిల్లులను చూసి తమ అధికారులకు చెపు తానని వెళ్లిపోయాడు. ఆయన పేరుగాని, తన హోదాగాని తెలుపమని అడగ్గా ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. బల్లి పాడు ఇసుక ర్యాంప్‌ వల్ల ఏటిగట్టు దారితో సహా గ్రామంలోకి వెళ్లేదారితో సహా అన్ని మార్గాలు వందలాది లారీలతో నిండిపోతున్నాయని అన్నా రు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూచిపూడి గణేష్‌, తొండెపు భరత్‌ కుమార్‌, వేమగిరి వెంకట్రావు, వల్లిపల్లి సతీష్‌, వల్లభని రామారావు, మద్దుకూరి శంకర్‌, ఉప్పులూరి రమేష్‌, అనపర్తి ప్రసాదు, దుగ్గిరాల శ్రీను, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు శ్రీహరి, నరేంద్ర, కొప్పాక వినీత్‌, కొడమంచిలి నితిన్‌, రాజేష్‌, జీవన్‌, ప్రభు, తులసి, జగన్‌, రమణ, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T00:19:24+05:30 IST