Share News

ప్రజల్లో చులకన అవుతున్నాం

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:07 AM

సామర్లకోట, డిసెంబరు 30: అధికార పక్షంలో ఉన్నా. కానీ గతంలో ఎన్నడూ ఏ అధికారులు వ్యవహరించని రీతి లో నేడు వ్యవహరిస్తున్నారు. దీంతో తాము డిమాండ్‌ చేసిన పనులేవీ జరగక ప్రజల్లో చులకన అవుతున్నాము అంటూ అధికార వైసీపీ సభ్యులు, సీనియర్‌ కౌన్సిలర్లు ఆవాల లక్ష్మీనా రాయణ, నేతల హరిబా

ప్రజల్లో చులకన అవుతున్నాం
సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సభ్యులు

సామర్లకోట కౌన్సిల్‌లో అధికార పక్ష సభ్యులు

సామర్లకోట, డిసెంబరు 30: అధికార పక్షంలో ఉన్నా. కానీ గతంలో ఎన్నడూ ఏ అధికారులు వ్యవహరించని రీతి లో నేడు వ్యవహరిస్తున్నారు. దీంతో తాము డిమాండ్‌ చేసిన పనులేవీ జరగక ప్రజల్లో చులకన అవుతున్నాము అంటూ అధికార వైసీపీ సభ్యులు, సీనియర్‌ కౌన్సిలర్లు ఆవాల లక్ష్మీనా రాయణ, నేతల హరిబాబు విరుచుకుపడ్డారు. శనివారం సా మర్లకోట మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం చైర్‌ప ర్సన్‌ జీ.అరుణ అధ్యక్షతన నిర్వహించారు. అజెండాపై చర్చ ప్రారంభించగా మొదటి,రెండవ అంశాలపై సభ్యులకు ఏ మాత్రం అవగాహన లేకుండా కమిషనర్‌ సమావేశానికి హా జరుకాకుండా అజెండాలోకి ఎలా చేర్చారు. దీనిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ లక్ష్మీనారాయణ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిబాబు మాట్లాడుతూ అధి కారులు లేకుండా అత్యవసర సమావేశం ఎవరికోసం నిర్వ హిస్తున్నారు, వాయిదా వేయవచ్చు కదా అని చైర్‌పర్సన్‌ను నిలదీశారు. దీంతో చైర్‌పర్సన్‌ సూచనల మేరకు మున్సిపల్‌ మేనేజర్‌ అత్యుతరాజు ప్రయత్నించినప్పటికీ మరికొందరు స భ్యులు అధికారుల వైఖరిపై వ్యతిరేఖత వ్యక్తం చేయడంతో సదరు అంశాలు వాయిదా వేశారు. నెలకొకసారి జరిగే కౌన్సి ల్‌లో సభ్యులు లేవనెత్తే పలు సమస్యలకు పరిష్కారం చూ పకుండా మొక్కుబడి సమావేశాలు నిర్వహించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదని రెడ్నం సునీత, పిట్టా సత్యనారాయణ, పితాని కృష్ణ, జట్ల మోహన్‌ తదితరులు ఆరోపించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:07 AM