సగ్గొండలో ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల వాగ్వాదం

ABN , First Publish Date - 2023-05-26T01:06:08+05:30 IST

ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా అనధికార సమావేశాల వెనుక ఆంతర్య మేమిటని సగ్గొండ గ్రామస్తులు గురువారం వాగ్వా దానికి దిగారు.

సగ్గొండలో ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల వాగ్వాదం
సగ్గొండ గ్రామసభలో అధికారులకు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్న గ్రామస్థులు

మండిపడిన పలువురు జనం

భారీగా పోలీసుల మోహరింపు

అభిప్రాయాలు చెప్పాలన్న సీఐ

గ్రామస్తుల భిన్నవాదనలు

వచ్చే నెల 5న మరోసారి గ్రామసభ

గోపాలపురం, మే 25 : ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా అనధికార సమావేశాల వెనుక ఆంతర్య మేమిటని సగ్గొండ గ్రామస్తులు గురువారం వాగ్వా దానికి దిగారు. గ్రామ శివారులో ఇటీవల మెడికల్‌ ఫాక్టరీ నిర్మాణానికి వ్యవసాయ భూమిని పారిశ్రా మిక భూమిగా బదిలీ చేయాలంటూ పరిశ్రమల నిర్వాహకులకు అడ్డగోలుగా పాలకవర్గం తీర్మాణం ఇవ్వడాన్ని నిరసిస్తూ 21వ తేదీ ఆదివారం గ్రామస్థు లంతా ఏకమై పంచాయితీ కార్యాలయాన్ని చుట్టిము ట్టిన విషయం తెలిసిందే. ఆ ముట్టడి కార్యక్రమంలో గ్రామ సభ నిర్వహించాలని గ్రామస్తులంతా పట్టు పట్టడంతో 25వ తేదీన గ్రామ సభ నిర్వహిస్తామని సర్పంచ్‌, కార్యదర్శులు హామీ ఇచ్చారు. అయితే 25వ తేదీన గ్రామ సభ నిర్వహిస్తున్నామంటూ గ్రామస్థు లకు టాంటాం వేయించలేదు. దీనిపై గ్రామస్థులు పలు సందేహాలు వ్యక్తం చేశారు. గురువారం ఉద యం పంచాయితీ కార్యాలయం వద్ద అనధికారకంగా కంపెనీ యాజమాన్యంతో సమావేశం నిర్వహిస్తు న్నారన్న సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్దకు చేరి వాగ్వాదానికి దిగారు. అయితే సమావేశానికి ముందుగానే దేవరపల్లి సీఐ ఎ శ్రీనివాసరావు, గోపాలపురం ఎస్‌ఐ కె రామకృష్ణ స్పెషల్‌ పోలీస్‌ల బలగంతో సమావేశం వద్ద మోహరించారు. ప్రజలు తమ అభిప్రాయాలు తెలియచేస్తే నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు తీపుకుంటామని సీఐ చెప్పారు. దీంతో ప్రజలు తమ అభిప్రాయాలను తెలియచేసేందుకు వెనక్కి తగ్గారు. చివరకు ధైర్యాన్ని కూడగట్టుకుని కొద్ది మంది కాలుష్యంతో గ్రామాన్ని నాశనం చేయొద్దని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తే మరి కొందరు వారికి వ్యతిరేకంగా పరిశ్రమలు పెట్టాలంటూ తమ అభి ప్రాయాలను తెలిపారు. రెండు వర్గాల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకున్నప్పటికీ అడుగడుగునా మోహరించిన పోలీసులు గ్రామస్తులను కట్టడి చేశారు. దీంతో జూన్‌ 5వ తేదీన గ్రామ సభ నిర్వహి స్తామని సభాముఖంగా సర్పంచ్‌ ప్రకటించారు.

Updated Date - 2023-05-26T01:06:08+05:30 IST