కత్తిపూడిలో చోరీ
ABN , First Publish Date - 2023-01-19T00:07:49+05:30 IST
కత్తిపూడి గుర్తుతెలియని దుండగులు ఓ ఇంట్లోకి ఆరుకాసుల బంగారం, నగదు అపహరించుకునిపోయారు. బాధితుడు కచ్చర్ల వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవా రం తన కుటుంబంతో బిక్కవోలు దర్శనానికి వెళ్లాడు. ఇంటికి వచ్చిచూసేసరికి సామగ్రి చిందరవంద
శంఖవరం, జనవరి 18: కత్తిపూడి గుర్తుతెలియని దుండగులు ఓ ఇంట్లోకి ఆరుకాసుల బంగారం, నగదు అపహరించుకునిపోయారు. బాధితుడు కచ్చర్ల వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవా రం తన కుటుంబంతో బిక్కవోలు దర్శనానికి వెళ్లాడు. ఇంటికి వచ్చిచూసేసరికి సామగ్రి చిందరవందరగా పడిఉన్నాయి. ఇంట్లో 6కాసు ల బంగారం, రూ.లక్షా ఎనభైమూడువేల నగదు అపహరణకు గురై ంది. వీరబాబు అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రత్తిపాడు సీఐ కిషోర్‌బాబు క్లూస్‌టీమ్‌తో సం ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు.
గండేపల్లిలో...
గండేపల్లి: గ్రామంలో మంగళవారం రాత్రి మామిడిపాక కళ్యాణ్ శ్రీనివాస్ కుటుంబసభ్యులతో భద్రాచలం వెళ్ళాడు. అయితే అర్ధరాత్రి దొంగలు అతడి ఇంటిలోకి ప్రవేశించి బీరువా తాళాలు పగలకొట్టి సుమారు 5 కిలోల వెండి వస్తువులు, బంగారు వస్తువులు, రూ.30 వేలు నగదు దొంగలించినట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గండేపల్లి ఎస్‌ఐ గణే్‌షకుమార్ కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.