Share News

రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జిపై రేపటి నుంచి రాకపోకలు

ABN , First Publish Date - 2023-11-10T00:23:26+05:30 IST

రాజమహేంద్ర వరం రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి మీద ఈ నెల 11వ తేదీ 9 గంటల నుంచి వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ డా. కె.మాధవీలత తెలిపారు.

రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జిపై రేపటి నుంచి రాకపోకలు

రాజమహేంద్రవరం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : రాజమహేంద్ర వరం రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి మీద ఈ నెల 11వ తేదీ 9 గంటల నుంచి వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ డా. కె.మాధవీలత తెలిపారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్‌ కం రైలు బ్రిడ్జి మరమ్మతుల నేపథ్యంలో సెప్టెంబరు 27 నుంచి రాకపోకలు బంద్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీకి పూర్తిగా మరమ్మతులు పూర్తి చేసి, 11వ తేదీ నుంచి రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్టు కలెక్టర్‌ చెప్పారు. సాధారణ, లైట్‌ వెయిట్‌ వాహనాలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారుల సూచనల మేరకు మోటారు సైకిళ్లు, లైట్‌ మోటారు వెహికిల్స్‌, ఆటోలు, లగేజీ గ్యారేజీ లేని ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు మాత్రమే అనుమతిస్తామన్నారు.

Updated Date - 2023-11-10T00:23:28+05:30 IST