ప్రభుత్వం వల్ల కాలేదు..!

ABN , First Publish Date - 2023-07-05T00:58:03+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు వేయడమే.. అది జరిగిందంటే చాలా అదృష్టం చేసుకున్నట్టే.. ఆ అదృష్టం ఎంత మందికి దక్కుతుంది.. నాలుగేళ్లలో వేళ్లపై లెక్కించవచ్చు.

ప్రభుత్వం వల్ల కాలేదు..!
రోడ్డు నిర్మాణంలో గ్రామస్తులు

మేమే చేసుకుంటున్నాం..

రంగంపేట, జూలై, 4 : వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు వేయడమే.. అది జరిగిందంటే చాలా అదృష్టం చేసుకున్నట్టే.. ఆ అదృష్టం ఎంత మందికి దక్కుతుంది.. నాలుగేళ్లలో వేళ్లపై లెక్కించవచ్చు. ఎందుకంటే ఏ గ్రామంలో.. పట్టణంలో రోడ్లు చూసినా అధ్వానమే.. గోతులతో నిండి పడుతూ లేస్తూ ప్రయాణించాల్సిందే.. నాయకులకు చెప్పినా.. అధికారులకు చెప్పినా ఏం లాభం ఉండదు.. సరే అంటారు.. ఊరుకుంటారు.. రంగంపేట నుంచి గండేపల్లి వెళ్లే 6 కిలోమీటర్ల రోడ్డే అందుకు ఉదాహరణ.. నిత్యం రద్దీగా ఉండే రోడ్డే అయినా నేటికీ పట్టించుకున్న వారే లేరు.. దీంతో ఆ దారిలో ప్రయాణించే రైతులు.. వాహనదారులు రోడ్డు నిర్మాణానికి దిగారు. రంగంపేట నుంచి గండేపల్లి రోడ్డు అధ్వానంగా తయారైంది. గత నాలుగేళ్లుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు మంజూరైంది. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో నాలుగేళ్లుగా దానిని పట్టించుకున్న నాథులే లేరు.. అధికారులకు.. నాయకులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా కాదని రైతులు, టీడీపీ నాయకులు కలిసి సొంత సొమ్ములుతో ట్రాక్టర్‌తో మట్టిని తెచ్చి రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకొని రంగంపేట నుంచి సింగంపల్లి రోడ్డు, రంగంపేట నుంచిజి.దొంతమూరు రోడ్లు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగంపేట ఉప సర్పంచ్‌బి.దుర్గారావు, టీడీపీ అధ్యక్షుడు పోతుల వీరవెంకట సత్యనారాయణ, ఉండవిల్లి గిరిబాబు, మల్లిబాబు, జి.చౌదరి, అర్జునరావు, ఎన్రాజు,కె.రామాంజనేయులు,వి.బొజ్జి,బి.కృష్ణ, కె.వెంకన్న, కె.శ్రీను,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-05T00:58:03+05:30 IST