Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2023-11-21T00:18:36+05:30 IST

జగ్గంపేట, నవంబరు 20: మండలంలో గోకవరం రోడ్డులో మాటలగుంట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం లో యువకుడు మరణించాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

జగ్గంపేట, నవంబరు 20: మండలంలో గోకవరం రోడ్డులో మాటలగుంట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం లో యువకుడు మరణించాడు.. పోలీసుల వివరాల ప్రకారం... సోమవారం మండలంలో గుర్రప్పాలెం గ్రామానికి చెందిన ఏలేటి సంతోష్‌కుమార్‌(25) దగ్గర బంధువులు అమ్మాయి మోటార్‌ సైకిల్‌ పైజె.కొత్తూరు వైపు నుంచి జగ్గంపేట వైపు వస్తుండగా ఎదురుగా ఉన్న మరో మోటార్‌ సైకిల్‌ ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో జగ్గంపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా సంతోష్‌కుమార్‌ మార్గమధ్యలో మృతి చెంద గా అమ్మాయికి గాయాలుకాగా ప్రైవేట్‌ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-11-21T00:18:37+05:30 IST