Share News

లారీ ఢీకొని భవానీ భక్తుడి దుర్మరణం

ABN , Publish Date - Dec 30 , 2023 | 01:33 AM

నల్లజర్ల, డిసెంబరు29: నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యలమంచిలి టౌన్‌ పరిధిలోని ఆగ్రహారం గ్రామానికి చెందిన భవానీ మాలధారుడు గొర్ల నానాజీ(29) అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకా రం.. ఆగ్రహారా

లారీ ఢీకొని భవానీ భక్తుడి దుర్మరణం

నలుగురికి తీవ్ర గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

నల్లజర్ల, డిసెంబరు29: నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యలమంచిలి టౌన్‌ పరిధిలోని ఆగ్రహారం గ్రామానికి చెందిన భవానీ మాలధారుడు గొర్ల నానాజీ(29) అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకా రం.. ఆగ్రహారానికి చెందిన గోర్ల నానాజీ, మటూరి లక్ష్మణరావు, గోర్ల అచ్చెన్నాయుడు, గోర్ల శ్రీను, ఎస్‌.లక్ష్మణరావు భవానీమాల ధరించారు. ఈనెల 23న స్వగ్రామం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి కాలి నడకన బయలుదేరారు. మార్గ మధ్యలో అచ్చన్నపాలెం హైవే పై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి లారీ వేగంగా దూసుకొచ్చింది. నానాజీ తల ఛిద్రమై అక్కడిక్కడే మృతి చెందగా మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఏఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో భవానీ భక్తుడు మృతి

అంతర్వేది, డిసెంబరు 29: సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన చిట్టాల దుర్గారావు(42) గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దుర్గారావు మేనల్లుడు అన్నంనీడి సుబ్ర హ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుర్గారావు గురువారం ఉద యం ఆరు గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై మూడు తూ ముల రోడ్డు వైపు నుంచి అంతర్వేది వస్తుండగా దండుపుంత జంక్షన్‌ వద్ద అంతర్వేది ఆలయానికి వెళుతున్న భక్తుల కారు ఢీకొనడంతో భవానీమాలతో ఉన్న దుర్గారావు రోడ్డుపై ఎగిరిపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో ఢీకొన్న కారులో వ్యక్తులు మలికిపురం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా దుర్గారావు పరిస్థితి విషమించడంతో భీమవరానికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. దుర్గారావుకు ఆపరేషన్‌ జరిగినా శుక్రవారం ఉదయం మృతి చెంద డంతో రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిం చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Dec 30 , 2023 | 01:33 AM