ఆర్‌ఎంసీకి పీజీ సీట్లు కేటాయింపు
ABN , First Publish Date - 2023-03-05T02:01:16+05:30 IST
కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్ ఎంసీ) పరిధిలోని పలు కీలక విభాగాలకు పీజీ సీట్లు కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ఉత్తర్వులు జారీ చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం తెలిపారు.
రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం
జీజీహెచ్ (కాకినాడ): మార్చి4: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్ ఎంసీ) పరిధిలోని పలు కీలక విభాగాలకు పీజీ సీట్లు కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ఉత్తర్వులు జారీ చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఏ వైద్య కళాశాలకు హాస్పటల్ అడ్మిన్‌స్ట్రేషన్ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) సీట్లు లేవ ని, ఇప్పుడు ఆర్‌ఎంసీకి ప్రప్రఽథమంగా 5 సీట్లు కేటాయించారన్నారు. అలాగే రేడియేషన్ అంకాలజీకి 5 సీట్లు, సైకియాట్రీ విభాగానికి 4 సీట్లు కేటాయించినట్టు ప్రిన్సిపాల్ వెల్లడించారు. అలాగే ఆర్‌ఎంసీలో ఇప్పటివరకు పెఽథాలజీ విభాగానికి 6 పీజీ సీట్లు ఉండగా, ఇప్పుడు మరో 8 సీట్లు కేటాయించారన్నారు. మైక్రోబయోలజీ విభాగానికి 6 పీజీ సీట్లు ఉండగా, అదనంగా మరో 4 సీట్లు, అలాగే ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి ఇప్పటివరకు 3 పీజీ సీట్లు ఉండగా, మరో 2 సీట్లు కేటాయించినట్టు తెలిపారు. ఆర్ధో విభాగానికి ఇప్పటివరకు 5 పీజీ సీట్లు ఉండగా, అదనంగా మరో 8 సీట్లు కేటాయించారని, అలాగే ఈఎన్‌టీ విభాగానికి ఇప్పటి వరకు 6 పీజీ సీట్లు ఉండగా ఇప్పుడు అదనంగా మరో 2 సీట్లు కేటాయించబడ్డాయి. ఇక ఆప్తాల్మాలజీ విభాగానికి ఇప్పటి వరకు 9 సీట్లు వుండగా ఇప్పడు మరో 4 పీజీ సీట్లు కేటాయించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అలాగే రేడియోలజీ విభాగానికి 4 పీజీ సీట్లుండగా, ఇప్పుడు మరో 3 సీట్లు కేటాయించారు. అలాగే న్యూరోసర్జరీ విభాగానికి ఇప్పటివరకు 2 పీజీ సీట్లు ఉండగా, మరో 4 సీట్లు అద నంగా కేటాయింపు జరిగిందన్నారు. 15 విభాగాలకు అదనపు పీజీ సీట్లు కోసం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేయగా 12 విభాగాలను పరిశీలించి 11 విభాగాలకు అద నంగా, అలాగే కొత్త పీజీ సీట్లకు కేటాయింపు జరగడం విశేషమన్నారు. ఫార్మకాలజీ విభాగానికి అదనంగా సీట్లు కేటాయింపు జరగాల్సి ఉందని, త్వరలోనే ఎన్ ఎంసీ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిపారు. కొత్తవి, అదనంగా సమకూరిన పీజీ సీట్లు మొత్తంగా 49 ఆర్‌ఎంసీకి కేటాయింపు జరగడం శుభపరిణామమన్నారు. ఆర్‌ఎంసీకి పీజీ సీట్లు కేటాయింపు విషయంలో గత నెల 1న ఎన్‌ఎంసీ బృందం కాకినాడ జీజీహెచ్, ఆర్‌ఎంసీలలో పర్యటించింది. ఈ సందర్భంగా అక్క డ ఉన్న లోటుపాట్లు, సదుపాయాలు, వైద్య వైద్యేతర సిబ్బంది, మౌలిక సదుపాయాలపై తనిఖీలు నిర్వహించింది. ఈ నేపఽథ్యంలో ప్రతిష్టాత్మకమైన కీలకమైన 49 అదనపు పీజీ సీట్లు కేటాయింపు జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది జూన్‌లో కొత్త అడ్మిషన్లు జరగనున్నట్టు నరసింహం వెల్లడించారు.