రికార్డులను సక్రమంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2023-06-07T00:51:56+05:30 IST

ఉపాధిహామీ పనుల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ప్రిసైడింగ్‌ అధికారి జీఎస్‌ రాంగోపాల్‌ ఆదేశించారు. మంగళవారం స్థానిక మండలం పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీరామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మ గాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ సభకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జీఎస్‌ రాంగోపాల్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా హాజరై మాట్లాడారు.

 రికార్డులను సక్రమంగా నిర్వహించాలి

  • ప్రిసైడింగ్‌ అధికారి రాంగోపాల్‌

  • రంగంపేటలో ‘ఉపాధి’ పథకం సామాజిక తనిఖీ సభ

రంగంపేట, జూన్‌, 6: ఉపాధిహామీ పనుల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ప్రిసైడింగ్‌ అధికారి జీఎస్‌ రాంగోపాల్‌ ఆదేశించారు. మంగళవారం స్థానిక మండలం పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీరామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మ గాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ సభకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జీఎస్‌ రాంగోపాల్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా హాజరై మాట్లాడారు. 22-5-2023 నుంచి 5-6-2023 వరకు మండలంలో సోషల్‌ ఆడిట్‌ బృందాలు పర్యటించి, గ్రామ సభలు నిర్వహించి సంబంధిత రిపోర్టును గ్రామ సభకు సమర్పించారని ఏపీవో వెంకటేశ్వరరావు తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1619 పనులకు గాను రూ.10,36,10,698, మెటీరియల్‌ నిమిత్తం రూ.41,07,208 ఖర్చు చేయగా పంచాయతీరాజ్‌ పనుల్లో మెటీరియల్‌ నిమిత్తం రూ.2,08,48,574, ఆర్‌డబ్ల్యుఎస్‌ నిమిత్తం 4 పనులకు రూ.9,02,755 ఖర్చు చేశామన్నారు. కొన్ని కొలతల్లో తేడా వచ్చిన పనులకు అపరాధ రుసుము విధించారు. ఈ పనులకు సంబంధించిన ప్రొసీజర్‌ డీవియేషన్‌నకు సంబంధించి సిబ్బందిపై రూ.8000 అపరాధ రుసుము విధించారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌ మొక్కలకు సంబంధించి చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటించాలని, ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని రాంగోపాల్‌ కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు, ఏఎంసీ వైస్‌ఛైర్మన్‌ అడబాల వెంకటేశ్వరరావు, వడిశలేరు, చండ్రేడు, వెంకటాపురం గ్రామాల సర్పంచ్‌లు, మండల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:51:56+05:30 IST