ఆర్బీకేలతో లాభసాటి వ్యవసాయం: హోం మంత్రి

ABN , First Publish Date - 2023-06-03T01:16:48+05:30 IST

ఆర్బీకే ద్వారా మెరుగైన వ్యవ సాయ పద్ధతులు, అనుబంధ యంత్ర పరికరాలు అందిస్తూ వ్యవసాయా న్ని లాభసాటిగా మా ర్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు.

ఆర్బీకేలతో లాభసాటి వ్యవసాయం: హోం మంత్రి

  • లాలాచెరువులో వైఎస్సార్‌ యంత్రసేవా పథకం మెగామేళా

దివాన్‌చెరువు, జూన్‌ 2: ఆర్బీకే ద్వారా మెరుగైన వ్యవ సాయ పద్ధతులు, అనుబంధ యంత్ర పరికరాలు అందిస్తూ వ్యవసాయా న్ని లాభసాటిగా మా ర్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. శుక్ర వారం లాలాచెరువు వ ద్ద నిర్వహించిన వైఎ స్సార్‌ యంత్రసేవా పథ కం మెగా మేళా 2.0 కార్యక్రమానికి మం త్రి వనిత, ఎంపీ మార్గాని భరత్‌, జాయింట్‌ కలె క్టర్‌ తేజ్‌భరత్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మంత్రి మాట్లాడుతూ గత పాలకుల సమయంలో వ్యవసాయాన్ని దండగ అంటే నాలుగేళ్ల పాలనలో జగనన్న ప్రభుత్వం వ్యవసా యాన్ని పండుగగా చేసి రైతులు సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకున్నా రన్నారు. ఎంపీ భరత్‌ మాట్లాడుతూ జిల్లాలో 166 సీహెచ్‌సీ గ్రూపులకు రూ5.96 కోట్లు విలువ చేసే 103 ట్రాక్టర్లు, హార్స్‌పవర్‌ గల 15 వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేస్తున్నామన్నారు. కొందరు అమలుకు నోచుకోని శుష్కవాగ్దానాలు ఇస్తున్నారని, గతంలో కుడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అమలు చేయని విషయాన్ని రైతులు, ప్రజలు గ్రహించాలని అన్నారు. జగన్‌ ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు కాపీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాననడం పచ్చి మోసపూరిత ప్రకటన ఎంపీ అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు, వైసీపీ రాజమహేంద్రవరం రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ బూరుగుపల్లి సుబ్బా రావు, సభ్యుడు తేజా, సహాయ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌, జిల్లా వ్యవసా యాధికారి ఎస్‌.మాధవరావు, నాయకులు గిరజాల బాబు, పాలిక శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:16:48+05:30 IST