రాజోలు నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష
ABN , First Publish Date - 2023-01-18T00:24:35+05:30 IST
ఉండవల్లిలో మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో మంగళ వారం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పాల్గొన్నారు.
ముఖాముఖిలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి
రాజోలు, జనవరి 17: ఉండవల్లిలో మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో మంగళ వారం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పాల్గొన్నారు. ఈసం దర్భంగా రాజోలు నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాలపై వారు చర్చించారు. రాజోలు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉందని చంద్రబాబు పేర్కొ న్నారు. పార్టీ ఆదేశాలతో రాజోలు నియోజకవర్గంలో కార్యక్రమాలన్నీ చురుగ్గా నిర్వహిస్తున్నారని బాబు అన్నారు. రాజోలు నియోజకవర్గంలో టీడీపీ మరింతగా పుం జుకుందన్నారు.నియోజకవర్గంలో టీడీపీకి కలిసివచ్చే సానుభూతిపరులను కలుపుకోవాలని, నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాలను మెరుగు పరచు కోవాలని గొల్లపల్లికి బాబు సూచించారు. తన పనితీరుపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తంచేశారని గొల్లపల్లి తెలిపారు. గొల్లపల్లి వెంట ఎంపీపీ కేతా శ్రీను, చాగంటి స్వామి, పితాని సూరిబాబు పాల్గొన్నారు.