రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2023-06-07T00:29:37+05:30 IST

శంఖవరం, జూన్‌ 6: గ్రామంలో అక్రమంగా నిల్వచేసిన రేషన్‌ బియ్యం గోడౌన్‌పై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి 26 క్వింటాళ్ళ బియ్యాన్ని సీజ్‌ చేశారు. విజిలె

రేషన్‌ బియ్యం పట్టివేత
శంఖవరంలో విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్న బియ్యం

శంఖవరం, జూన్‌ 6: గ్రామంలో అక్రమంగా నిల్వచేసిన రేషన్‌ బియ్యం గోడౌన్‌పై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి 26 క్వింటాళ్ళ బియ్యాన్ని సీజ్‌ చేశారు. విజిలెన్స్‌ అధికారుల వివరాల ప్రకారం.. విజిలెన్స్‌ ఎస్పీ కరణం కుమా ర్‌ ఆదేశాల మేరకు సీఐ రమేష్‌, తహశీల్దార్‌ విజయ్‌కుమార్‌ బృందం శంఖవరంలో అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని నిల్వచేసి తరలిస్తున్నారనే సమాచారంతో దాడి చేసి 26 క్వింటాళ్ళ బియ్యం సీజ్‌ చేసి పాటంశెట్టి కృష్ణపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-06-07T00:29:37+05:30 IST