రామాలయం పేటలో తాగునీటి సమస్య పరిష్కారం

ABN , First Publish Date - 2023-06-26T23:56:49+05:30 IST

అమలాపు రం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్‌ తన సొంత నిధులతో తాగునీటి పైపులైను ను నిర్మించి రామాలయంపేటవాసుల కు తాగునీటి సమస్యను తీర్చారు.

రామాలయం పేటలో తాగునీటి సమస్య పరిష్కారం

సొంత నిధులతో పైపులైను నిర్మించిన హరీష్‌

ఐ.పోలవరం, జూన్‌ 26: అమలాపు రం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్‌ తన సొంత నిధులతో తాగునీటి పైపులైను ను నిర్మించి రామాలయంపేటవాసుల కు తాగునీటి సమస్యను తీర్చారు. దివ ంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాల యోగి స్వగ్రామం రామాలయంపేట లో తాగునీటి పైపులైను చెడిపోవడంతో నీటి సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో గంటి హరీష్‌మాధుర్‌ తన సొంత నిధులతో మంచి నీటి పైపులైను నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించారు. దీంతో సోమవారం గ్రామంలో పర్యటించిన హరీష్‌మాధుర్‌, దాట్ల బుచ్చిబాబులు నూతనంగా నిర్మించిన మంచి నీటి ట్యాంకులను ప్రారంభోత్సవం చేసి గ్రామస్థులకు తాగునీరు అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, ముదునూరి రామలింగరాజు, సాయి వాసురాజు, ముదు నూరి వాసురాజు, బొంతు శ్రీరాములు, జనిపల్లి గిరి, గంజా రాము పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:56:49+05:30 IST