కుర్చీ ఎవరిదో?

ABN , First Publish Date - 2023-03-16T00:51:51+05:30 IST

రామచంద్రపురం పురపాలక సంఘం చైర్‌పర్సన్‌ గాదంశెట్టి శ్రీదేవి పదవీకాలం ఒప్పందం ముగియనుంది. ఈనెల 18 నాటికి శ్రీదేవి చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లు కావస్తోంది. అయితే గతంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి కోసం అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు పోటీపడ్డాయి.

  కుర్చీ ఎవరిదో?

ముగుస్తున్న రామచంద్రపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవీకాలం

ఒప్పందం గడువు

నాడు ఇద్దరి కౌన్సిలర్ల మధ్య పదవీకాలం పంపకం

పట్టణంలో రసవత్తర చర్చ.. అధిష్ఠాన నిర్ణయమే కీలకం

అమలాపురం(ఆంధ్రజ్యోతి), మార్చి15: రామచంద్రపురం పురపాలక సంఘం చైర్‌పర్సన్‌ గాదంశెట్టి శ్రీదేవి పదవీకాలం ఒప్పందం ముగియనుంది. ఈనెల 18 నాటికి శ్రీదేవి చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లు కావస్తోంది. అయితే గతంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి కోసం అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు పోటీపడ్డాయి. దాంతో ఆ పార్టీ అధిష్ఠానం సూచనలతో 22వ వార్డు కౌన్సిలర్‌ ప్రస్తుత చైర్‌పర్సన్‌ గాదంశెట్టి శ్రీదేవి, 6వ వార్డు కౌన్సిలరు మేడిశెట్టి వెంకటలక్ష్మి మధ్య పంపకం చేశారు. తొలి రెండేళ్లు గాదంశెట్టి శ్రీదేవి, తదుపరి మూడేళ్లు మేడిశెట్టి వెంకటలక్ష్మి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా కొనసాగేవిధంగా అంగీకారం కుదిరింది. మంత్రి వేణుగోపాలకృష్ణ స్వయంగా వైసీపీ కౌన్సిలర్ల సమావేశంలో ఈ ఒప్పందం ప్రకటించారు. ఆ మేరకు గాదంశెట్టి శ్రీదేవిని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా వైసీపీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. చైర్‌పర్సన్‌గా గాదంశెట్టి శ్రీదేవి ప్రమాణస్వీకారం చేశారు. గతంలో కుదిరిన అంగీకారం మేరకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవీకాలం ఈనెల 18తో ముగియనుంది. తదుపరి 6వ వార్డు కౌన్సిలరు మేడిశెట్టి వెంకటలక్ష్మి చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావాల్సి ఉంది. జనరల్‌ మహిళకు రిజర్వు అయిన చైర్‌పర్సన్‌ పదవి వైసీపీలో కీలక నేతగా ఉన్న కాపు సామాజికవర్గానికి గాదంశెట్టి శ్రీధర్‌ సతీమణి శ్రీదేవికి తొలి రెండేళ్లు అవకాశం ఇచ్చారు. ఇక మరో కీలక నేతగా ఉన్న శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వ్యాపారవేత్త మేడిశెట్టి శేషారావు సతీమణి మేడిశెట్టి వెంకటలక్ష్మి తదుపరి మూడేళ్లు చైర్‌పర్సన్‌గా అవ కాశం కల్పిస్తామని అప్పట్లో ప్రకటించారు. పట్టణంలో సంఖ్యాపరంగా శెట్టిబలిజ, కాపులు రెండు ప్రధాన సామాజిక వర్గాలుగా ఉన్నాయి. గత మున్సిపల్‌ ఎన్ని కల వరకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఈ రెండు సామాజికవర్గాలకు చెందినవారు చేపట్టలేదు. గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కొమ్మన నాగేశ్వరరావు నెల రోజులు చైర్మన్‌గాను, తదుపరి శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన మేడిశెట్టి సూర్యనారాయణ ఇన్‌చార్జి చైర్మన్‌గా మాత్రమే ఉన్నారు. 2021లో ఎన్నికల తరువాత తొలిసారిగా కాపు సామాజిక వర్గం నుంచి శ్రీదేవి తొలి మహిళా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అయ్యారు. అటు ము న్సిపాలిటీ ఏర్పాటు తరువాత శెట్టిబలిజ సామాజికవర్గానికి ఇప్పటివరకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా అవకాశం దక్కలేదు. ప్రస్తుతం మునిసిపాలిటీలో వైసీపీ తరపున 24 మంది కౌన్సిలర్లు ఉండగా, అందులో 9 మంది కాపు, 8 మంది శెట్టిబలిజలతోపాటు బ్రాహ్మణ, రజక, దేవాంగ, తూర్పుకాపు, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, ఎస్టీలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. కాగా గతంలో ప్రకటించిన మేరకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ల పదవీకాలం పంపకాల విషయం మంత్రి వేణుగోపాలకృష్ణ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. ఇప్పటికే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. అధిష్ఠానం ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుందన్న విషయంలో రకరకాల కథనాలు వినవస్తున్నాయి. అయి తే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మార్పు సున్నిత అంశం కావడంతో పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు ఈ విషయంలో నిర్ణయం ఉండే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - 2023-03-16T00:51:51+05:30 IST