ముక్కలైన నిడదవోలు రైల్వే గేటు

ABN , First Publish Date - 2023-06-26T01:13:23+05:30 IST

నిడదవోలు రైల్వేగేటును ఆదివారం సాయంత్రం వాహనం ఢీకొనడంతో రైల్వేగేటు రెండు ముక్కలుగా విరిగిపోయింది.

ముక్కలైన నిడదవోలు రైల్వే గేటు

నిడదవోలు, జూన్‌ 25 : నిడదవోలు రైల్వేగేటును ఆదివారం సాయంత్రం వాహనం ఢీకొనడంతో రైల్వేగేటు రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఒక వైపు గేటు విరిగిపోవడంతో రెండో వైపు గేటు తెరుచుకోలేదు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో సుమారు గంట పాటు భారీగా వాహ నాలు, ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు తక్షణ చర్యల్లో భాగంగా స్పైడర్‌భూమ్‌ ద్వారా మాన్యువల్‌గా గేటును నియం త్రించి ఎక్కడా రైళ్లకు ఆలస్యం లేకుండా రాకపోకలు పునరుద్ధరించారు. అయితే గేటు మరమ్మతులు పూర్తయ్యే వరకు నెహ్రూబొమ్మ సెంటరు నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.రైల్వేగేటును ఢీకొట్టింది నిడదవోలు నుంచి తాడేపల్లిగూ డెం వైపు వెళుతున్న బొలేరో వాహనంగా ఆర్‌పీఎఫ్‌ పోలీసులు గుర్తించారు.

Updated Date - 2023-06-26T01:13:23+05:30 IST