రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు కాంగ్రెస్‌ శ్రేణుల నిరసన

ABN , First Publish Date - 2023-03-26T01:45:34+05:30 IST

కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌వరకు చేపట్టిన జోడో యాత్ర విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని చూస్తే ప్రధాని మోదీ వెన్నులో వణుకు పుడుతోందని, అందువల్లే రాహల్‌గాంధీని ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చారని పీసీసీ ప్రధాన కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వ రరావు, పీసీసీ సభ్యుడు ఆకుల వెంకటరమణ, కాకినాడ సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు ధ్వజమెత్తారు.

రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు   కాంగ్రెస్‌ శ్రేణుల నిరసన

కాకినాడ సిటీ, మార్చి 25: కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌వరకు చేపట్టిన జోడో యాత్ర విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని చూస్తే ప్రధాని మోదీ వెన్నులో వణుకు పుడుతోందని, అందువల్లే రాహల్‌గాంధీని ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చారని పీసీసీ ప్రధాన కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వ రరావు, పీసీసీ సభ్యుడు ఆకుల వెంకటరమణ, కాకినాడ సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీని ఎంపీ పదవి నుంచి సస్పెండ్‌ చేయడంపై పార్టీ శ్రేణులు శనివారం నిరసన వ్యక్తం చేశాయి. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులు ప్రదర్శనగా స్థానిక కల్పన సెంటర్‌ను చేరుకుని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్య దర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావు, పీసీసీ సభ్యుడు ఆకుల వెంకటరమణ, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు, పార్టీ నాయకులు పెద్దాడ సుబ్బారాయుడు, కంభం రాజబాబు, తుమ్మలపల్లి వాసు, మాగాపు శ్రీను, తాళ్లూరి రాజు, పిట్టా అర్జున్‌, తమ్మనపూడి సత్తప్పనాయుడు, మొయ్యేటి సూర్యప్ర కాష్‌, కేవీవీ ఎస్‌ఎన్‌ మూర్తి, పబ్బినీడి కృష్ణ, బావిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.

ప్రత్తిపాడులో కాంగ్రెస్‌ నిరసన

ప్రత్తిపాడు, మార్చి 25: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయ డాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు ప్రతిపాడులో గాంధీబొమ్మ సెంటర్‌లో శని వారం నిరసన తెలిపారు. పీసీసీ సభ్యుడు ధరణాలకోట శ్రీను, దాసరి సత్తిబాబు, కందిమళ్ల శామ్యూల్‌, షేక్‌ అంకా, సాహెచ్‌, తాతీలు కె.సూరిబాబు పాల్గొన్నారు

Updated Date - 2023-03-26T01:45:34+05:30 IST