రాహుల్‌గాంధీపై అనర్హత వేటు తక్షణమే ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2023-03-26T01:34:08+05:30 IST

ఏఐసీసీ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంఽధీపై అనర్హత వేటు వేయ డాన్ని నిరసిస్తూ రాజమహేంద్రవరంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోడా వెంకట్‌ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన ధర్నా చేశారు.

రాహుల్‌గాంధీపై అనర్హత వేటు తక్షణమే ఎత్తివేయాలి
జాంపేట గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న బోడా వెంకట్‌, ఇతర నాయకులు

రాజమహేంద్రవరంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 25: ఏఐసీసీ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంఽధీపై అనర్హత వేటు వేయ డాన్ని నిరసిస్తూ రాజమహేంద్రవరంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోడా వెంకట్‌ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన ధర్నా చేశారు. శనివారం ఉదయం జాంపేటగాంఽధీ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి ప్లకార్డులతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా బోడా వెంకట్‌ మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది ఒక చీకటి దినమని అన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు అని ధ్వజమెత్తా రు. రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో అదానీ అంశాన్ని లేవనెత్తి జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ విచారణకు పట్టుబట్టడంతోనే ఆయన గొంతు నొక్కాలని కుట్రచేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కొవ్వూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాహుల్‌గాంఽధీ 2024లో ప్రఽదాని అవుతారని భయపడిన బీజేపీ కుట్ర చేసింద న్నారు. ఈ ధర్నాలో పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు, మారంపూడి వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, యిజ్జరౌతు విజయలక్ష్మి, చింతాడ వెంకటేశ్వరరావు, గట్టి నవతారకేష్‌, బత్తిన చంద్రరావు, నందు, సిక్కిత పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T01:34:08+05:30 IST