Share News

క్వారీల నిర్వహణకు ప్రజాభిప్రాయ సేకరణ

ABN , First Publish Date - 2023-11-21T23:17:39+05:30 IST

మండలంలోని గౌరీపట్నంలో క్రషర్లు, క్వారీలు, నిర్వహించుకునేందుకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినట్టు జిల్లా వీఆర్వో నరసింహులు తెలిపారు.

క్వారీల నిర్వహణకు ప్రజాభిప్రాయ సేకరణ

దేవరపల్లి, నవంబరు 21: మండలంలోని గౌరీపట్నంలో క్రషర్లు, క్వారీలు, నిర్వహించుకునేందుకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినట్టు జిల్లా వీఆర్వో నరసింహులు తెలిపారు. గౌరీపట్నంలో పంగిడి, దుద్దుకూరు, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన క్వారీ భూముల్లో క్వారీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కోసం నలుగురు దరఖాస్తు చేసుకున్నారని, వాటిని పరిశీలించి ప్రజాభిప్రాయం సేకరించి అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. క్వారీలు ఏర్పాటు చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని క్వారీ సంఘాల నాయకులు, ప్రజలు తెలిపారన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అనుమతులిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పర్యావరణ శాఖ ఈఈ సందీప్‌రెడ్డి, క్వారీ, క్రషర్స్‌ యజమానులు, తహశీల్దార్‌ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T23:17:40+05:30 IST