‘బంగారుకొండ’తో ఐదేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహరం

ABN , First Publish Date - 2023-06-03T01:21:09+05:30 IST

రాష్ట్రంలో ఐదేళ్ల లోపు వయసున్న ఎత్తుకు, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించి వారిని పూర్తిస్థాయి ఆరోగ్యవంతులుగా తయారుచేసేందుకు ప్రత్యేక పోషకాహారాన్ని అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మండల ప్రత్యేక అధికారిణి జగదాంబ తెలిపారు.

‘బంగారుకొండ’తో ఐదేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహరం

  • తాళ్లపూడి ప్రత్యేక అధికారిణి జగదాంబ

తాళ్లపూడి, జూన్‌ 2: రాష్ట్రంలో ఐదేళ్ల లోపు వయసున్న ఎత్తుకు, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించి వారిని పూర్తిస్థాయి ఆరోగ్యవంతులుగా తయారుచేసేందుకు ప్రత్యేక పోషకాహారాన్ని అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మండల ప్రత్యేక అధికారిణి జగదాంబ తెలిపారు. బంగారుకొండ పథకంపై అవగాహన కల్పించేందుకు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఐసీడీఎస్‌, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ లతో ప్రభుత్వ శాఖలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారుకొండ కార్యక్రమం ద్వారా పిల్లలందరూ ఆరోగ్యవంతు లుగా తయారవుతారన్నారు. కార్యక్రమ నిర్వహణలో సమాజంలోని దాతలను, వివిధ శాఖలను భాగస్వామ్యం చేయాలన్నది ప్రభుత్వ ముఖ్యఉద్దేశ్యమని అన్నారు. ఈ కార్యక్రమం ఆరు నెలల పాటు జరుగుతుందని, పోషణ అందించేందుకు ఒక్కొక్కరికి నెలకు రూ.500 ఖర్చవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జోన్నకూటి పోసిరాజు, ఐసీడీఎస్‌ సీడీపీవో మమ్మి, సూపర్‌వైజర్‌ భాగ్యకుమారి, ఆర్‌ఐ క్రాంతిరేఖ, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:21:09+05:30 IST