బ్యూటీపార్లర్‌ ముసుగులో వ్యభిచారం

ABN , First Publish Date - 2023-02-21T01:31:33+05:30 IST

రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డు ప్రాంతంలో బ్యూటీ పార్లర్‌ ముసుగులో వ్యభిచారం చేస్తుండగా ప్రకాష్‌నగర్‌ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఏవీ రోడ్డులో ఎస్‌.విజయలక్ష్మి అనే మహిళ ఒక బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. ఇందులో ముగ్గురు యువతులు పనిచేస్తున్నారు. సుమారు ఏడాదికాలంగా పార్లర్‌ నడుస్తుండగా, ఇద్దరు యువతులకు జీతం ఇవ్వడంలేదని మానేశారు. మరో యు

బ్యూటీపార్లర్‌ ముసుగులో వ్యభిచారం

యువతులకు మీ న్యూడ్‌ ఫొటోలున్నాయంటూ బెదిరింపు

నిర్వాహకురాలు అరెస్టు

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 20: రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డు ప్రాంతంలో బ్యూటీ పార్లర్‌ ముసుగులో వ్యభిచారం చేస్తుండగా ప్రకాష్‌నగర్‌ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఏవీ రోడ్డులో ఎస్‌.విజయలక్ష్మి అనే మహిళ ఒక బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. ఇందులో ముగ్గురు యువతులు పనిచేస్తున్నారు. సుమారు ఏడాదికాలంగా పార్లర్‌ నడుస్తుండగా, ఇద్దరు యువతులకు జీతం ఇవ్వడంలేదని మానేశారు. మరో యువతి మాత్రం పనిచేస్తోంది. ఆ యువతి కూడా జీతం ఇవ్వడంలేదని నిర్వాహకురాలని అడగగా నీకు పై డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పడంతో ఆ యువతి కూడా మానే స్తానని చెప్పింది. దీంతో నిర్వాహకురాలికి కోపం వచ్చి నా దగ్గర పనిచేసిన నీకు సంబంధించిన న్యూడ్‌ ఫొటోలు ఉన్నాయని, వాటిని సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ చేస్తానని బెదిరించింది. దీంతో ఆ యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు పార్లర్‌పై నిఘా పెట్టి ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సందర్భంగా పార్లర్‌లో కండోమ్‌లు, మద్యం సీసాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకురాలు విజయలక్ష్మిని, ఆమెకు సహకరిస్తున్న ప్రశాంత్‌కుమార్‌, మరొక యువకుడిని అరెస్టు చేశారు.

Updated Date - 2023-02-21T01:31:34+05:30 IST