Share News

హామీల అమలులో అసత్య ప్రచారం

ABN , Publish Date - Dec 29 , 2023 | 11:51 PM

ఎన్నికల హామీల అమ లులో ముఖ్యమంత్రి జగన్‌ 85శాతం ఫెయిలయ్యారని ముమ్మిడివరం మాజీ ఎమ్యెల్యే, టీడీపీ ఇన్‌చార్జి దాట్ల బుచ్చిబాబు ఆరోపించారు.

హామీల అమలులో అసత్య ప్రచారం

నవరత్నాలు- నవమోసాలు పుస్తకావిష్కరణ

ఐ.పోలవరం, డిసెంబరు 29: ఎన్నికల హామీల అమ లులో ముఖ్యమంత్రి జగన్‌ 85శాతం ఫెయిలయ్యారని ముమ్మిడివరం మాజీ ఎమ్యెల్యే, టీడీపీ ఇన్‌చార్జి దాట్ల బుచ్చిబాబు ఆరోపించారు. మురమళ్ల పార్టీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జగన్‌ ఫెయిల్యూర్‌పై రూపొందించిన నవరత్రాలు- నవ మోసాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇచ్చిన 730 హామీల్లో కేవలం 109మాత్రమే అమలు చేసిన జగన్‌ ప్రతి సభలోను 95.5 శాతం అమలు చేసినట్టు అసత్య ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, చెల్లి అశోక్‌, పొద్దోకు నారాయణరావు, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, నిమ్మితి చిరంజీవి, శ్రీరాములు, రాజారావు, సోమన్న, విప్లవకుమార్‌, మూర్తి, గోపి, ప్రసాద్‌, భైరవమూర్తి పాల్గొన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లు: ఎమ్మెల్యే వేగుళ్ల

మండపేట: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఎపుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమికి ప్ర జలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే వేగుళ్ల ధీమా వ్యక్తం చేశారు. మండపేట టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో టీడీపీ నా యకులు గ్రంఽథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ నల్లమిల్లి వీర్రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌, పిల్లాతాతాలు, పెన్మెత్స నరేష్‌రాజు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు పాల్గొన్నారు.

జగన్‌ పాదయాత్ర హామీల అమలులో ఫెయిల్‌

మామిడికుదురు: సీఎం జగన్‌ పాదయాత్ర సమయ ంలో ఇచ్చిన హామీలు అమలు చేయ డంలో పూర్తిగా ఫె యిల్‌ అయ్యారని జడ్పీ మాజీ చైర్మన్‌ నామన రాంబాబు ఆరోపించారు. పాశర్లపూడిలో జరిగిన టీడీపీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో ఇచ్చిన 730హామీల్లో అమలు చేసింది 119మాత్రమేనని పేర్కొ న్నారు. పాశర్లపూడిలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న తిక్కా సత్యప్రసాద్‌, కాట్రపర్తి ఆంజనేయులుకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వారు సమకూర్చిన దుస్తులను పేదలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మం డలవాఖ అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్‌, నాయకులు మద్దాల కృష్ణమూర్తి, బోనం బాబు, సూదా బాబ్జి, వర్థినీడి వెంకట్రామయ్య, కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.

పేదల సొంతింటి కల టీడీపీతోనే సాధ్యం

కొత్తపేట: పేదలకు సొంతింటి కల టీడీపీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముత్యాల బాబ్జీ పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో పలు వురు నాయకులు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పేరిట ప్రభు త్వం భారీ అవినీతికి పాల్పడిందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో 17వేలకుపైగా ఇళ్ల పట్టాలు అందించామని వైసీపీ నేతలు చెప్తున్నారన్నారు. లబ్ధిదారులకు అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి దాపురించిందన్నారు. శ్రీనివాసరావు, భాస్కరరావు, తాతాజీ, ఏసు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 11:51 PM