Share News

సమస్యలు పరిష్కారమయ్యే వరకు దీక్షలు

ABN , Publish Date - Dec 14 , 2023 | 01:24 AM

సమస్యలు పరిష్కారమయ్యే వరకు దీక్షలు

సమస్యలు పరిష్కారమయ్యే వరకు దీక్షలు

అమలాపురం టౌన్‌, డిసెంబరు 13: గ్రామీణ తపాలా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు, సమస్యలను పరిష్కరించే వరకు దీక్షలను విరమించేది లేదని పీజేసీఏ అమలాపురం డివిజన్‌ చైర్‌పర్సన్‌ వీవీ మహాలక్ష్మి పేర్కొన్నారు. జీడీఎస్‌ ఉద్యోగులు సమస్యల పరిష్కారానికై చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా రెండో రోజైన బుధవారం అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం నిర్వహిం చారు. వందలాది మంది ఉద్యోగులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ నుంచి పోస్టల్‌ కార్యదర్శి పంపించిన అప్పీల్‌ కాపీలను అసిస్టెంట్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ డీవీఎల్‌విశ్వేశ్వరరావు జీడీఎస్‌ ఉద్యోగులకు అందజేశారు. భయభ్రాంతులకు గురిచేసినా దీక్షలు విరమిం చేదిలేదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గురువారం నుంచి మరికొన్ని పోస్టల్‌ యూనియన్లు సమ్మెలోకి రానుండ డం శుభపరిణా మమన్నారు. మహాలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో కన్వీనర్‌ రాయల్‌, ఎన్‌యూజీడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రమణ, ఏఐజీడీ ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు వీవీ రామకృష్ణ, ఎన్‌యూ జీడీఎస్‌ డివిజన్‌ సంఘ అధ్యక్షుడు భీమార్జునరావు, డివిజన్‌ కార్యదర్శ రమేష్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 01:24 AM