సమస్యల పరిష్కారానికి కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2023-08-22T00:36:56+05:30 IST

ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సఖినేటిపల్లి మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం నిరసన చేప ట్టారు.

సమస్యల పరిష్కారానికి కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన

అంతర్వేది, ఆగస్టు 21: ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సఖినేటిపల్లి మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం నిరసన చేప ట్టారు. సీఆర్‌ఎంటీ, సీఆర్పీ, అక్కౌంటెంట్‌, ఆఫీసు అటెండ ర్లంతా కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మినిమం టైమ్‌ స్కేలు, జూలై నెల జీతాల బడ్జెట్‌ విడుదల చేయాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేనిపక్షాన ధర్నా చేపడతామన్నారు. పాద యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చి కాంట్రాక్టు ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఆర్పీ బుంగ కిశోర్‌, అక్కౌంటెంట్‌ బెల్లంకొండ రాజబాబు, కాంట్రాక్టు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:36:56+05:30 IST