ప్రైవేటు జులుం

ABN , First Publish Date - 2023-06-03T01:40:27+05:30 IST

ప్రభుత్వ ఆదాయ వనరులు అత్యంత కీలక భూమిక వహించే గనులు, భూగర్భశాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రైవేటీకరించడం వివాదాస్పదమవుతోంది. ప్రజల్లో అవగాహన కల్పించకుండా కాంట్రాక్టు సంస్థలు ప్రైవేటు సైన్యంతో ఖనిజాలు రవాణాచేసే వాహనదారులపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం గ్రామాల్లో తీవ్ర అలజడి రేపుతోంది.

ప్రైవేటు జులుం
పి.గన్నవరం మండలం ముంగండపాలెం శివారు గాజులగుంట వద్ద ఓ రైతు చేలో మట్టి తవ్వుతున్న దృశ్యం..

  • ఖనిజ సంపద ‘ప్రైవేటు’ పరం

  • సుధాకర్‌ ఇన్‌ఫ్రాటెక్‌కు కాంట్రాక్టు బాధ్యతలు అప్పగింత

  • రెండేళ్లలో రూ.233 కోట్ల వసూళ్లకు నిర్ణయం

  • వైసీపీ నేతల కనుసన్నల్లో సుధాకర్‌ ఇన్‌ఫ్రా

  • క్వారీలు, మట్టి సంపద తరలింపుపై సీనరేజ్‌

  • ప్రైవేటు సిబ్బందితో వసూళ్లకు చెక్‌ పోస్టులు

  • రైతుల చేలల్లో మట్టికీ సీనరేజ్‌ వసూళ్లు

  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

  • ప్రభుత్వ నిర్ణయాలపై వైసీపీ నేతలు సైతం అసహనం

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ ఆదాయ వనరులు అత్యంత కీలక భూమిక వహించే గనులు, భూగర్భశాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రైవేటీకరించడం వివాదాస్పదమవుతోంది. ప్రజల్లో అవగాహన కల్పించకుండా కాంట్రాక్టు సంస్థలు ప్రైవేటు సైన్యంతో ఖనిజాలు రవాణాచేసే వాహనదారులపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం గ్రామాల్లో తీవ్ర అలజడి రేపుతోంది. మరీ ముఖ్యంగా రైతులు చేలల్లో మెరకను తీసుకుని మట్టిని తర లించే ట్రాక్టర్ల నుంచి కూడా సీనరేజ్‌ వసూలు చేయడంతో ఎక్కడికక్కడే ఆందోళనలు మొదలయ్యాయి. అటు ప్రభుత్వంగానీ, ఇటు జిల్లా ఉన్నతాధికారులుగానీ ఈ సంస్థకున్న హక్కులు, వసూలుచేసే తీరుపై రైతులకు సైతం అవగాహన కల్పించకపోవడంతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో గత కొన్ని రోజుల నుంచి వివాదాలు తలెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గల గనులు, భూగర్భశాఖ, చిన్న తరహా ఖనిజాలకు సంబంధించి క్వారీల వెలికితీయు ఖని జాల నుంచి సీనరేజ్‌ వసూలు చేసుకునే హక్కులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరించింది. ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన బిడ్డిం గ్‌లో సుధాకర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఈ బిడ్డింగ్‌ దక్కించుకుంది. రెం డేళ్ల కాలపరిమితికి రూ.233 కోట్లకు తీసుకోగా ప్రతినెలా అడ్వాన్సుగా రూ.9.70 కోట్లను ప్రభుత్వానికి చెల్లించాలి. సీన రేజ్‌ ఫీజు, కన్సిడేషన్‌ అమౌంట్‌, డీఎంఎఫ్‌, మెరిట్‌, ఇన్‌కం ట్యాక్సును ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం క్వారీల్లో తీసే ఖనిజ సంపద నుంచి వసూలుచేసుకునేందుకు ప్రభు త్వం ఏప్రిల్‌ 18వ తేదీ నుంచి ఆ కాంట్రాక్టు సంస్థకు ఇసుక, పెద్ద తరహా ఖనిజాలు మినహాయించి ఉమ్మడి జిల్లాలోని ఖనిజ సంపదపై సర్వహక్కులు కల్పిస్తూ గనులు, భూగర్భ శాఖ అధికారులు ఉత్తర్వులిచ్చారు. దాంతో సుధాకర్‌ ఇన్‌ఫ్రా టెక్‌ పేరిట వసూళ్లు చేసుకునేందుకు ప్రైవేటు సైన్యాన్ని భా రీగా నియమించారు. గోపాలపురం సమీపంలోని హైవేపై ఒక ప్రత్యేక ప్రైవేటు చెక్‌పోస్టును ఏర్పాటుచేసి కంకర, క్వారీ డెస్ట్‌, ఎర్రకంకర వంటి వాహనాలతోపాటు మట్టి రవాణా చేసే వాహనాలపై కూడా భారీగా చార్జీలు వసూలు చేస్తు న్నారు. గోపాలపురం చెక్‌పోస్టు వద్ద రాత్రివేళల్లో ఖనిజ సంపద రవాణాచేసే వాహనాలను ప్రైవేటుసైన్యం నిలుపు దలచేసి లారీకి వారికున్న నిబంధనల మేరకు రూ.3159ను కంకర లారీలకు వసూలు చేస్తున్నారు. ఇక కోనసీమ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చేలల్లో ఉన్న నల్లమట్టిని తీసు కువెళ్లే రైతుల నుంచి కూడా వసూళ్ల పర్వం కొనసాగుతోం ది. రైతు చేలోంచి రైతే మట్టి తోలుకుంటే ట్రాక్టరుకు రూ. 200 చెల్లించాలి. లేనిపక్షంలో ప్రైవేటు సైన్యం అపరాధ రుసుంగా రూ.350 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తుం దంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనాడూ మైన్స్‌ అధికారులకు రైతు ఎవరూ రూపాయి కట్టకుండానే మట్టిని తరలించేవారమని, సుధాకర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ పేరిట చేల ల్లో తోలే మట్టికి సైతం సీనరేజ్‌ను వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కారుల్లో ట్రాక్టర్లను వెంబడిస్తూ వాహనాలు ఆపి బలవంత పు వసూళ్లకు పాల్పడుతున్న సుధాకర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ నియ మించిన సిబ్బందిగా చెప్పుకుంటున్న వారిని సఖినేటిపల్లి మండలంలో స్థానికులు నిలిపివేసి సెల్‌ఫోన్లను సైతం లాక్కొన్నారు. తమకు అనుమతులు ఉన్నాయంటూ ప్రైవేటు సిబ్బంది చెబుతున్నప్పటికీ వినకుండా వారిని తీవ్ర స్థాయి లో హెచ్చరించి పంపించారు. ఇదే తరహాలో రాజోలు, ము మ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలో ప్రైవేటు సైన్యం వసూళ్లపై ఆయా గ్రామాలకు చెందిన రైతులు, వివి ధ రాజకీయపక్షాలకు చెందిన రైతులు ఆందోళన చేపడుతు న్నారు. అయితే ఒకవైపు తువ్వ ఇసుకపై జేపీ సంస్థ హక్కు లు పొందితే కంకర, మట్టిపై సుధాకర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ పేరిట సీనరైజ్‌ ఇతరత్రా పన్నుల రూపంలో వసూళ్లు చేస్తున్న తీరుపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార వైసీపీకి చెందిన కీలక నేతల ముసుగులో బినామీ కాంట్రా క్టర్లకు వందల కోట్ల విలువైన ఖనిజ సంపదను దోచిపెడు తూ ప్రజలను నిలువునా ముంచేస్తున్నారంటూ వారి నుంచి ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ఈ వసూళ్ల వ్యవహారం తీరుపై జిల్లా యంత్రాంగం ప్రజలకు స్పష్టత కల్పించకపోతే శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కానున్నాయి.

Updated Date - 2023-06-03T01:40:27+05:30 IST