ఈ ఏడాదిలోనే 150 ఎంబీబీఎస్‌ సీట్లు భర్తీ

ABN , First Publish Date - 2023-06-03T01:19:30+05:30 IST

రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఈ విద్యాసంవత్సరం నుంచే 150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.సౌభాగ్యలక్ష్మి తెలిపారు.

ఈ ఏడాదిలోనే 150 ఎంబీబీఎస్‌ సీట్లు భర్తీ
బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రిన్సిపాల్‌ సౌభాగ్యలక్ష్మి

రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 2 : రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఈ విద్యాసంవత్సరం నుంచే 150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.సౌభాగ్యలక్ష్మి తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో శుక్రవారం ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించి విలేక రులతో మాట్లాడారు. మెడికల్‌ కాలేజీ విధులను ఒక ఛాలెంజ్‌గా తీసుకుని సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు. రాజమహేంద్రవరం మెడికల్‌ కాలేజీ నూతన మెడికల్‌ కాలేజీకి కావాల్సిన ప్రధాన మౌలిక సదుపాయాలపై ముందుగా దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. తరగతి గదులు, ప్రయోగశాల, హాస్టల్స్‌, టీచింగ్‌స్టాఫ్‌ తదితర అంశాలపై వైద్యులు, నర్సింగ్‌స్టాఫ్‌తో శనివారం లేదా సోమవారం సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తానని తెలిపారు. అనంతరం ప్రాధాన్యతాక్రమంలో పనులను వేగవంతం చేస్తామన్నారు. ఆమెను వైద్యులు హేమంతి, రాజేశ్వరి, మనోజ్‌కుమార్‌, ఆర్‌ఎంవో నజీరుద్దీన్‌, మెడికల్‌ కాలేజీ మేనేజర్‌ శ్రీనివాస్‌ తదితరులు అభినందనలు తెలిపారు.

Updated Date - 2023-06-03T01:19:30+05:30 IST