మళ్లీ ప్రీపెయిడ్‌ ఆటోస్టాండ్‌

ABN , First Publish Date - 2023-03-19T01:33:29+05:30 IST

రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో ప్రీపెయిడ్‌ ఆటోస్టాండ్‌ పునఃప్రారంభించడానికి చర్యలు చేపట్టారు.మూడేళ్లుగా ఇది మూతపడడంతో ప్రయాణికులు భద్రతాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటోవాలాలు కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ సమస్యలపై ఈ నెల 16న ’రాత్రయితే దడ’ శీర్షికతో ప్రయాణికుల రక్షణకు సంబంధించి ’ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే.

మళ్లీ ప్రీపెయిడ్‌ ఆటోస్టాండ్‌
ప్రీపెయిడ్‌ ఆటో స్టాండ్‌ క్యాబిన్‌ శుభ్రం చేయిస్తున్న కానిస్టేబుల్‌

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), మార్చి 18: రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో ప్రీపెయిడ్‌ ఆటోస్టాండ్‌ పునఃప్రారంభించడానికి చర్యలు చేపట్టారు.మూడేళ్లుగా ఇది మూతపడడంతో ప్రయాణికులు భద్రతాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటోవాలాలు కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ సమస్యలపై ఈ నెల 16న ’రాత్రయితే దడ’ శీర్షికతో ప్రయాణికుల రక్షణకు సంబంధించి ’ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి మూతపడిన పోలీస్‌ ఔట్‌పోస్ట్‌, ఆటోస్టాండ్‌ క్యాబిన్‌ని వెంటనే ప్రారంభించాలని, ప్రయాణికుల భద్రతకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో శనివారం క్యాబిన్‌ని శుభ్రం చేశారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్‌తో సమన్వయం చేసుకుంటూ టూటౌన్‌ సీఐ టి.గణేష్‌ ప్రీపెయిడ్‌ ఆటో సర్వీసు ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నారు. బందోబస్తు డ్యూటీల వల్ల సిబ్బంది కొరతతో ఆటో సర్వీసు ఈ నెలాఖరుకు ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అప్పటి వరకూ క్యాబిన్‌లో పోలీస్‌లను అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.

Updated Date - 2023-03-19T01:33:29+05:30 IST