సిలబస్ పూర్తిచేయకపోతే చర్యలు తప్పవు
ABN , First Publish Date - 2023-08-06T00:58:11+05:30 IST
సిలబస్ పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ హెచ్చరించారు.
రంగంపేట, ఆగస్టు, 5 : సిలబస్ పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ హెచ్చరించారు. రంగంపేట మండలం కొత్తవీరంపాలెం ప్రాఽథమిక పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐదో తరగతి పాఠ్యపుస్తకాలను, సాధన పుస్తకాలను పరిశీలించి సిలబస్ ప్రకారం పాఠ్యాంశాలు పూర్తిచేయకపోవడం,దిద్దకపోవడంతో హెచ్‌ఎం సత్యనారాయణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి సంతృప్తి వ్యక్తం చేశారు.హెచ్‌ఎం ఎంవీడీ.ప్రసాదరావు, ఆంగ్ల ఉపాధ్యాయుడు పీటర్‌పాల్, విద్యార్ధుల కృషిని అభినందించారు.అనంతరం రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మనబడి నాడు-నేడులో నిర్మితమైన మరుగుదొడ్లును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసరావును అభినందించారు. ఆయన వెంట ఆర్‌జేడీలు ఐ.శారద,జి.నాగమణి, డీఈవో ఎస్.అబ్రహాం,డీవీఈవో జె.వి.వి.ఎస్.సుబ్రహ్మణ్యం,ఆర్‌ఐవో ఎంఎస్‌వీఎల్ నరసింహం, డీవైఈవో తిరుమలదాస్ ఎంఈవోలు తదితరులు ఉన్నారు.