ధాన్యం కొనుగోలు ఎప్పుడు?
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:22 AM
రౌతులపూడి, డిసెంబరు 17: మిచౌంగ్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటల నష్టపరిహారం ఇంకా ఎన్ని రోజులు లెక్కిస్తారు, తడిసిన ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల సత్యప్రభ ప్రశ్నించా రు. మూలగపూడిలో తడిసిన ధాన్యాన్ని ఆదివారం పరిశీ లించి ఆరబెట్టుకుని అమ్ముకోవడానికి చూస్తూన్న రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసేవారులేరని, పెట్టుబడి కూడా రాదని అప్పులుపాలయ్యామని రైతులు సత్యప్రభ ఎదుట వి
ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి సత్యప్రభ
రౌతులపూడి, డిసెంబరు 17: మిచౌంగ్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటల నష్టపరిహారం ఇంకా ఎన్ని రోజులు లెక్కిస్తారు, తడిసిన ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల సత్యప్రభ ప్రశ్నించా రు. మూలగపూడిలో తడిసిన ధాన్యాన్ని ఆదివారం పరిశీ లించి ఆరబెట్టుకుని అమ్ముకోవడానికి చూస్తూన్న రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసేవారులేరని, పెట్టుబడి కూడా రాదని అప్పులుపాలయ్యామని రైతులు సత్యప్రభ ఎదుట విలపించారు. తక్షణం ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు, సర్పంచ్ తమరాల సత్యనారాయ ణ,ఎంపీపీ గంటిమళ్ల రాజ్యలక్ష్మి, ఎంపీటీసీ సోమరౌతు రవి పసగడుగుల రమణ, మాజీ సర్పంచ్‌లు పెద్దదివాణం, పైల సాంబశివరావు, పైల పైడిరాజు, నాగం రాము ఉన్నారు.