ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు అవకాశం
ABN , First Publish Date - 2023-04-30T01:01:56+05:30 IST
విద్యాహక్కు చట్ట ప్రకారం ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో వివిధ వర్గాలకు చెందిన పేదలకు 25 శాతం సీట్ల భర్తీకి రెండో విడత ప్రకటన వెలువడిందని డీఈవో అబ్రహాం పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), ఏప్రిల్ 29: విద్యాహక్కు చట్ట ప్రకారం ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో వివిధ వర్గాలకు చెందిన పేదలకు 25 శాతం సీట్ల భర్తీకి రెండో విడత ప్రకటన వెలువడిందని డీఈవో అబ్రహాం పేర్కొన్నారు. వెనుకబడిన, బలహీన వర్గాలు, అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన పిల్లలు ఒకటవ తరగతిలో ప్రవేశాల కోసం జ్ట్టిఞ://ఛిట్ఛ.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు మే 15 వ తేదీ వరకూ స్వీకరించడం జరుగుతుందన్నారు. అర్హత నిర్ధారణ 16 నుంచి 20వ తేదీ వరకూ, లాటరీ 22వ తేదీన నిర్వహిస్తారని డీఈవో పేర్కొన్నారు. మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, విద్యాశాఖా ధికారులను కూడా సంప్రదించవచ్చని సూచించారు.