కన్నులపండువగా ప్రభల తీర్థం

ABN , First Publish Date - 2023-01-18T00:18:38+05:30 IST

ముక్కనుమను పుర స్కరించుకుని బండారులంక గ్రామ దేవత మురు గులమ్మ అమ్మవారి ఆలయం వద్ద మంగళవారం ప్రభల తీర్థాన్ని వైభవంగా నిర్వహించారు.

కన్నులపండువగా ప్రభల తీర్థం

అమలాపురం రూరల్‌, జనవరి 17: ముక్కనుమను పుర స్కరించుకుని బండారులంక గ్రామ దేవత మురు గులమ్మ అమ్మవారి ఆలయం వద్ద మంగళవారం ప్రభల తీర్థాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన శ్రీఉమా రామలింగేశ్వర, త్రయంబకేశ్వర స్వామి, చినచం ద్రపురం గౌరీమల్లికార్జున ప్రభలను ఆయా ప్రాంతాల భక్తులు ఊరే గింపుగా మురుగులమ్మ ఆలయం వద్దకు తోడ్కొని వచ్చారు. మురుగులమ్మ అమ్మవారిని వివిధ ప్రాం తాలకు చెందిన భక్తులు దర్శించుకున్నారు. ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా తాలూకా ఎస్‌ఐ అందే పరదేశి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-01-18T00:18:39+05:30 IST