పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌వోలు
ABN , First Publish Date - 2023-12-03T01:27:59+05:30 IST
పిఠాపురం నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల వద్ద స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు నమోదు, మార్పు లు, చేర్పులు నిమిత్తం దరఖాస్తులు స్వీకరిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
అంతంతమాత్రంగా స్పందన
గొల్లప్రోలు/పిఠాపురంరూరల్, డిసెంబరు2: పిఠాపురం నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల వద్ద స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు నమోదు, మార్పు లు, చేర్పులు నిమిత్తం దరఖాస్తులు స్వీకరిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ప్రత్యేక శిబిరాలకు అంతంతమాత్రంగానే స్పం దన లభించింది. గొల్లప్రోలు పట్టణంలోని 50,53,54,58, 61 పోలింగ్ బూత్‌లను ఆంధ్రజ్యోతి శనివారం పరిశీలించగా బీఎల్‌వోలు అందుబాటులో ఉన్నా ఓటర్లు, ప్రజలు మాత్రం కనిపించలేదు. కనీసం ఓటర్ల జాబితా పరిశీలనకు వారు ఆసక్తి కనబరచకపోవడం గమనార్హం. పిఠాపురంమండలం చిత్రాడలోని 170,172 పోలింగ్‌బూత్‌లవద్ద ఇదే పరిస్థితి కనిపించింది. ఆదివారం కూడా ప్రత్యేక శిబిరాలు అన్ని పోలింగ్ కేంద్రాలవద్ద కొనసాగుతాయి. వీటి గురించి విస్తృత ప్రచారం జరపకపోవడమే స్పందన అంతంతమాత్రంగా ఉండటానికి కారణంగా చెబుతున్నారు.
పోలింగ్ బూత్‌లను సందర్శించిన ఆర్డీవో
సామర్లకోట: ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు అన్ని పోలిం గ్ బూత్‌లలో నూతన ఓటర్ల చేర్పులకు సంబంధించి బీఎల్వోలు చేపట్టిన నమోదు ప్రక్రియను పెద్దాపురం ఆర్డీవో జే.సీతారామా రావు శనివారం సామర్లకోట మండలంలో పలు గ్రామాలు, సా మర్లకోట పట్టణ పరిధిలో పలు పోలింగ్‌బూత్‌లను సందర్శించా రు. ఇప్పటివరకూ నమోదైన దరఖాస్తులను ఆర్డీవో పరిశీలించా రు. చిరునామా మార్పులు, ఫోటోల మార్పులు తదితర అంశాల కు చెందిన ధ్రువపత్రాలు సక్రమంగా జారీ చేస్తున్నారా, లేదా అనే అంశాలను ఆర్డీవో పరిశీలించి తగు సూచనలు చేశారు.
అర్హులైన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి
కరప: అర్హులైన యువతీ యువకులందరూ ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ పి.శ్రీనివాసరావు సూచించారు. కరప, పెనుగుదురు తదితర గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించి పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు ప్రత్యేక డ్రైవ్‌ను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కరపలోని ఎంపీపీ పాఠశాలలో 231,232,233 పరిధిలో పోలింగ్‌స్టేషన్లో ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించి బీఎల్‌వోలకు ఆయన సూచనలు చేశారు.
జె.కొత్తూరులో స్పెషల్ డ్రైవ్
జగ్గంపేట: జగ్గంపేట నియోజకవర్గంలో 248 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. మండలంలో 74బూత్ లను శనివారం జె.కొత్తూరులో స్పెషల్ డ్రైవ్‌పై రెవెన్యూ సిబ్బంది అధికారులు పార్టీ నాయకులతో ఓటరు నమోదు కార్యక్రమాలు, ఇతర వివరాల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.శని, ఆదివారాల్లో రెండు రోజు లపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాల జారీచేశారు. కొత్తగా నమోదు చేయించుకోవాల్సిన వారు ఓటు నమోదు చేయించుకోవాలన్నారు.
తాళ్ళూరులో పోలింగ్ కేంద్రం పరిశీలన
గండేపల్లి: మండలంలో 18 గ్రామాల పరిధిలో పోలింగ్ బూత్ ల వద్ద శనివారం స్పెషల్ క్యాంపెయింగ్ డే నిర్వహించారు. బీఎల్‌వోలు కొత్త ఓట్లు నమోదు, ఓట్లు అవకతవకలు ఉంటే బీఎల్‌వోలు పర్యక్షించారు. ఈ డ్రైవ్‌లో సూపర్‌వైజర్లు డిప్యూటీ తహసీల్దార్ దివ్యభారతి, ఆర్‌ఐ సురేష్, జూనియర్ అసిస్టెంట్ ఎం.రవికుమార్‌లు తహసీల్దార్ సత్యనారాయణ ఆదేశాలమేరకు పోలింగ్ బూత్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిని వారు ప్రతిఒక్కరు ఓటు నమోదుచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వీఆర్వోలు సుబ్బారావు, లాజర్ పాల్గొన్నారు
ఓటర్ల నమోదు ప్రత్యేక శిబిరాలు
ప్రత్తిపాడు: జాతీయ ఎన్నికల సంఘం ఉత్తర్వులు మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో 227 పోలింగ్ కేంద్రా లు వద్ద ఓటర్ల నమోదు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. శని, ఆదివారాల్లో రెండు రోజులు పాటు ఈ విబిరాలు కొనసాగుతాయని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎ.శ్రీనివాసరావు తెలిపారు. తహసీల్దార్ గోపాలకృష్ణతో కలిసి ప్రత్తిపాడులోని పోలింగ్ కేంద్రాలను, ఓటర్లనమోదు తీరును ఆయన శనివారం పరిశీలించారు.