టీడీపీ కార్యకర్తపై చేయి చేసుకున్న సీఐ
ABN , First Publish Date - 2023-03-19T02:29:18+05:30 IST
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకోవడాన్ని స్వా గతిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు విజయోత్సవ వేడుకలు జరుపుకుం టుండగా బాణాసంచా కాలుస్తున్న ఒక కార్యకర్తపై పట్టణ సీఐ చేయిచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయోత్సవాల్లో ఘటన.. టీడీపీ నేతల ఆందోళన
జరిగిన ఘటనపై చింతిస్తున్నట్టు సీఐ ప్రకటనతో ఆందోళన విరమణ
అమలాపురం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకోవడాన్ని స్వా గతిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు విజయోత్సవ వేడుకలు జరుపుకుం టుండగా బాణాసంచా కాలుస్తున్న ఒక కార్యకర్తపై పట్టణ సీఐ చేయిచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చివరకు సీఐ ఘటనపై చింతిస్తున్నట్టు చేసిన ప్రకటనతో టీడీపీ శ్రేణులు శాం తించాయి. టీడీపీ మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు గెలు చుకోవడంతో అమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబ త్తుల ఆనందరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శ మెట్ల రమణ బాబు సహా ఆ పార్టీ శ్రేణులు శనివారం గడియార స్తంభం సెం టర్‌లో విజయోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో ఒక వాహనంలో ఉన్న బాణా సంచా జువ్వలు కాల్చేందుకు ప్రయత్నిస్తున్న కార్యకర్తలను తొలు త పట్టణ ఎస్‌ఐ హరీష్‌కుమార్ అడ్డుకున్నారు. నేతల జోక్యంతో విడిచిపెట్టారు. అనంతరం సెంటర్‌లోనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించిన తర్వాత నాయకుల సూచనల పై కారులో ఉన్న జువ్వలను తీసివేస్తుండగా పట్టణ సీఐ డి.దుర్గాశేఖర్‌రెడ్డి ఆగ్రహానికి లోనై ఓ దళిత కార్యకర్తపై చేయి చేసుకున్నారు. దాంతో మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, టీడీపీ నాయకులు రమణబాబుతో సహా మిగిలిన నాయకులందరూ సీఐతో వాగ్వివాదానికి దిగారు. క్షమాపణ చెప్పాలని డిమాండుచేస్తూ పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట వర్షంలో సైతం నాయ కులు రాస్తారోకో నిర్వహించారు. సీఐ దుర్గాశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీ నేతలు సెంటర్‌లో రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. పరిస్థితులు చేజారిపోతుండడంతో టీడీపీ నాయకులను స్టేషన్ వద్దకు పిలిపించిన సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి జరిగిన ఘటనకు చింతిస్తున్నట్టు ప్రకటించడంతో వివాదం సర్దుమణిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడ స్వామినాయుడు, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయ లక్ష్మి, నాయకులు నల్లా స్వామి, పరమట శ్యామ్‌కుమార్, దెందుకూరి సత్తిబాబురాజు, తిక్కి రెడ్డి నేతాజీ, బోనం సత్యవరప్రసాద్, బత్తుల సాయి, ఆవుపాటి గోపాల్, మట్టా మహలక్ష్మి ప్రభాకర్, వలవల శివరావు, పిచ్చిక శ్యామ్, రాజులపూడి భీముడు తదితరులు పాల్గొన్నారు.